అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో.. రామ మందిర పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కాగా.. ఈ పనులు కొద్ది రోజుల్లో పూర్తవనుండగా, తర్వాత డెకరేషన్ వర్క్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. వేడుకకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం అలంకరణ పనులు మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
బుద్ధ జయంత్యుత్సవాలకు నల్లగొండ జిల్లా నందికొండలోని బుద్ధవనం ముస్తాబైంది. 2,566 వ బుద్ధ జయంతి సందర్భంగా బుద్ధవనం, ధ్యానవనం, జాతక వనం, మహాస్థూపం, ఎంట్రన్స్ ప్లాజాలో 2,566 రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. బుద్ధవనం ప్రారంభం తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్న బుద్ధ జయంతిని వీక్షకులకు మధురానుభూతులు పంచేలా నిర్వహిస్తున్నామని బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉండ్రు రాజశేఖర్ ‘సమకాలీన సమాజానికి బౌద్ధ’ అనే…