బంగ్లాదేశ్‌లో మహిళా టీవీ జర్నలిస్ట్ సారా రహ్మునా(32) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. రాజధాని ఢాకాలోని హతిర్‌జీల్ సరస్సు నుంచి బుధవారం ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మీడియా కథనాలు తెలిపాయి.
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే చంపింది ఓ ఇల్లాలు. ఈ ఘటన గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి కొడుకును అరెస్ట్ చేయగా.. మహిళ పరారీలో ఉంది.
ప్రముఖ నృత్యకారిణి, పద్మ విభూషణ్ యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల కేంద్ర కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతపం తెలిపారు. భారతదేశంలో భరతనాట్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ప్రఖ్యాతి గడించిన పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఇకలేరనే వార్త విచారకరం అన్నారు.
2022లో గిర్ సోమనాథ్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో 32 ఏళ్ల వ్యక్తికి గుజరాత్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడికి చనిపోయే వరకు ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌ఐ భోరానియా తీర్పు చెప్పారు. దీంతో పాటు నిందితుడికి రూ.25 వేల జరిమానా కూడా విధించారు
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లా ప్రధాన కార్యాలయానికి 30 కిలోమీటర్ల దూరంలోని అడవులు, ఎత్తైన పర్వతాలతో చుట్టుముట్టబడిన దేసాలో సోమవారం సాయంత్రం 7.30 గంటలకు భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల తూటాలకు వీర జవాన్లు ధీటుగా సమాధానం చెప్పారు. కాగా.. ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ థాపా, సైనికుడు నాయక్ డి రాజేష్, కానిస్టేబుల్ బిజేంద్ర, అజయ్ సింగ్ గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ మాజీ హెడ్ డిజైనర్ ఇయాన్ కామెరాన్ దారుణ హత్యకు గురయ్యాడు. జర్మనీలోని తన భవనంలోకి ప్రవేశించిన ఓ దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. ఈ సమయంలో.. అతని భార్య వెరెనా క్లోస్ పక్కనే ఉంది. ఆమె గోడ దూకి తన ప్రాణాలను కాపాడుకుంది. కాగా.. ఈ ఘటనపై ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. సమాచారం ప్రకారం.. అతను జర్మనీలోని హెర్షింగ్‌లోని లేక్ అమ్మర్సీలో ఉన్న తన విలాసవంతమైన భవనంలో…
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. అమాయక బాలుడిని ఓ మృగాడు పొట్టన పెట్టుకున్నాడు. తాగిన మైకంలో ఏమీ ఏర్పడక కడతేర్చారు. బాలుడిని దారుణంగా నేలకేసి కొట్టి చంపాడు సవతి తండ్రి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు గురయ్యారు. శుక్రవారం పెరంబూర్‌లోని ఆయన నివాసానికి సమీపంలో ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పరిచయం ఉన్న బాలిక మాట్లాడేందుకు నిరాకరించిందని యువకుడు ఘాతుకానికి తెగబడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నగరంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.