అత్తామామలు మద్యం మత్తులో కోడలిని హత్యచేశారు. ఈ దారుణమైన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి వద్ద చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... శంషాబాద్ మండలం రామాపురం తండాకు చెందిన ముడావత్ దోలిని అదే తండాకు చెందిన ముడావత్ సురేష్ కు15 సంవత్సరాల క్రితం వివాహం అయింది.
Nalgonda: మానవత్వం మంటగలుస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వృద్ధులపై విచక్షణారహితంగా కొందరు దాడులు చేస్తున్నారు. ఆస్తుల కోసం కొందరు, భారమై మరికొందరు వృద్ధులపై దాడికి పాల్పడుతున్నారు.
ఇటీవల కాలంలో మానవ సంబంధాలకు అసలు విలువే లేకుండా పోయింది. క్షణకాల సుఖం కోసం నీచమైన పనులు చేయడానికి కూడా మనుషులు సిద్ధమవుతున్న తీరు సభ్యసమాజం భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది. ఏకంగా వావి వరసలు మరిచిపోయి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు కొందరు దుర్మార్గులు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఈ మధ్యకాలంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం నాగటూరులో దారుణం జరిగింది.
దసరా పండుగ పూట శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది.. చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లి సమీపంలో అత్తా కోడళ్లపై అత్యాచారానికి తెగబడ్డారు గుర్తుతెలియని వ్యక్తులు.. నిర్మాణంలో ఉన్న ఓ పేపర్ మిల్లులో వాచ్‌మన్‌గా ఉంటుంది ఓ కుటుంబం.. అయితే, రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు.. కొడవలితో బెదిరించి ఘాతుకానికి పాల్పడినట్టు బాధితులు చెబుతున్నారు..
హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడలో అత్త మామలను చంపేందుకు కుట్ర పన్నింది ఓ కోడలు. ఇందుకోసం బ్లాక్ మ్యాజిక్ ను చేసే బురిడి బాబును ఆశ్రయించింది. బ్లాక్ మ్యాజిక్ తో అత్తమామలను చంపేందుకు తనను ఆశ్రయించిన మహిళను బురిడీ కొట్టించాడు నకిలీ బాబా మహమ్మద్ ఖలీద్.. నాజియా అనే మహిళ తన అత్తమామలను బ్లాక్ మ్యాజిక్ తో చంపాలని కుట్ర పన్నింది. అయితే ఆమెనే మోసం చేసే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన…
పానీపూరి అంటే ముఖ్యంగా చిన్న పిల్లలకు చాలా ఇష్టం. దానిని లొట్టలేసుకుని తింటుంటారు. అంతేకాకుండా.. సరిపోకుంటే ఇంటికి పార్శిల్ తెచ్చుకుని మరీ తింటారు. అయితే.. ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు పానీపూరీని తింటున్నారు. గల్లీలో ఇటు చివర.. అటు చివర దర్శనమిస్తాయి. అయితే.. అదే పానీపూరి ఓ అత్త కోడలు మధ్య గొడవకు కారణమైంది. అసలు విషయానికొస్తే.. పానీపూరీలు తీసుకొచ్చిన భర్త తన కంటే ముందే తల్లికి పెట్టాడని భార్యకు కోపం వచ్చింది. దీంతో.. రాత్రంతా…
అత్త, కోడలు మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే.. పాము, ముంగిసకు మధ్య ఉన్న వైరం అంతా ఉంటుంది. కోడలు చేసే ప్రతి పనిలో అత్తమామలు తప్పు కనిపెట్టి కించపరిచే చేస్తుంటారు. అలాంటప్పుడు.. కోడలు వాళ్లు ఉన్న ఇంట్లో ఉండటం కష్టంగా ఉంటుంది. మీకు కూడా మీ సంబంధంలో అలాంటి అత్త ఉంటే.. ఇంట్లో నుంచి వెళ్లే బదులు ఈ తెలివైన మార్గాల్లో వ్యవహారించండి.. తద్వాత జీవితాన్ని కొంత ప్రశాంతంగా జీవించవచ్చు. ఇంతకీ ఏంటో తెలుసుకుందాం.
ఇటీవల ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులను కూడా మోసం చేస్తున్నారు. కుటుంబ సమస్యలు, ఆస్తి గొడవల వ్యవహారంలో అత్తను సొంత కోడలు కిడ్నాప్ చేసి నానా హింసలు పెట్టింది. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం మన్నూరులో ఆస్తి కోసం వృద్ధురాలిని కిడ్నాప్ చేసింది.