Nalgonda: మానవత్వం మంటగలుస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వృద్ధులపై విచక్షణారహితంగా కొందరు దాడులు చేస్తున్నారు. ఆస్తుల కోసం కొందరు, భారమై మరికొందరు వృద్ధులపై దాడికి పాల్పడుతున్నారు. తాజాగా ఓ కోడలు తన మామను వృద్ధుడని కూడా చూడకుండా చెప్పుతో దాడి చేసింది. వీల్ చైర్ లో కూర్చున్న మామ వద్దకు పరుగున వచ్చిన కోడలు చెప్పుతో కొట్టింది. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. నవంబర్ 20వ తేదీ ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ ఘటన వైరల్ అవుతోంది.
Read also: Jagadish Reddy: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కేసీఆర్ పుణ్యమే..
నడవలేని స్థితిలో వీల్‌ఛైర్‌లో ఉన్న మామపై కోడలు విచక్షణా రహితంగా దాడి చేసి, దుర్భాషలాడిన ఘటన శెట్టిపాలెంలో సంచలనంగా మారింది. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న చెప్పు తీసుకుని మామ ముఖంపై పొట్టు పొట్టు కొట్టింది. కోడలు కాళ్లు పట్టుకున్న కనికరించ కుండా ముఖంపై చెప్పుతో దాడి చేస్తూనే ఉంది. అయితే అక్కడే ఉన్న పెంపుడు కుక్క ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసింది. కుక్క అరుస్తున్నప్పటికీ కోడలు పట్టించుకోలేదు. పెద్దాయన అక్కడి నుంచి కదలలేక కన్నీరుమున్నీరుగా విలపించాడు. తన తలను కొట్టుకుంటూ ఏడుస్తూ వీల్‌ఛైర్ పైనే కన్నీరుపెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారు ఆ మూగ జీవికున్న మానవత్వం మనిషికి లేకుండా పోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. నడవలేని స్థితిలో వున్న ఆ పెద్దాయనపై చెప్పుతో కొట్టిన కోడలిని కఠినంగా శికించాలని డిమాండ్ చేస్తున్నారు.
Chhattisgarh: పోలీస్ బేస్ క్యాంపుపై నక్సలైట్ల దాడి.. ముగ్గు జవాన్లకు…