అత్తామామలు మద్యం మత్తులో కోడలిని హత్యచేశారు. ఈ దారుణమైన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి వద్ద చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… శంషాబాద్ మండలం రామాపురం తండాకు చెందిన ముడావత్ దోలిని అదే తండాకు చెందిన ముడావత్ సురేష్ కు15 సంవత్సరాల క్రితం వివాహం అయింది. గత కొన్ని రోజులుగా భార్య భర్తల మద్య గొడవల కారణంగా అత్త తుల్శీ, మామ అనంతి సాతంరాయిలో ఉంటూ కూలీ పనులు చేస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం సురేష్ దోలి భార్యాభర్తలు గ్యాస్ స్టవ్ రిపేయిర్ కోసం శంషాబాద్ వచ్చారు.
READ MORE: Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తెలుగు కుర్రాడు.. అరంగేట్రంలోనే దిగ్గజ ఆటగాడితో ఢీ!
అప్పటికే ఇద్దరి మద్య తీవ్ర స్థాయిలో గోడవలు జరిగాయి. దీంతో దోలి సాతంరాయిలో ఉన్న అత్తమామల వద్దకు వచ్చింది. అత్త, మామ, కోడలు కలిసి కల్లు కాంపౌండ్ లో మద్యం సేవించారు. ముగ్గురు మత్తులోకి జారుకున్నాక కోడలు దోలిని సాతంరాయి త్రీలోక అపార్ట్మెంట్ సమీపంలోని నిర్మాణుష ప్రాంతానికి తీసుకొచ్చారు. అక్కడ అమెను హత్యచేసి మట్టిలో పూడ్చేసి వెళ్ళిపోయారు. అయితే నిర్మాణంలో ఉన్న త్రిలోక అపార్ట్మెంట్ వారు మట్టిని తీసుకొచ్చి అక్కడే డప్ చేయడంతో దాదాపు 25 ఫీట్ల లోనికి దోలి మృతదేహం కూడుకుపోయింది. ఏమీ తెలియనట్టు కొడుకుతో కలిసి కోడలు కనిపించడం లేదని శంషాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ పోలీసులకు ఎక్కడా ఎలాంటి క్లూ లభించలేదు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం బయటకు వచ్చింది. మట్టి కుప్పలో కూడుకుపోయిన మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు పోష్టు మర్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
READ MORE: Deputy CM Pawan Kalyan: రేపు పిఠాపురంలో పవన్ పర్యటన.. తొలిసారిగా ఏడీబీ రోడ్డులో..! ఎందుకంటే..?