తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది.. గత రెండు రోజుల నుంచి భక్తులు తిరుమల కొండకు భారీ సంఖ్యలో వెళ్తున్నారు. డిసెంబర్ లో సెలవులు రావడంతో చివరి రెండు వారాల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
చిన్నపాటి తప్పిదాలు TTD కొంప ముంచాయా? అధికారుల మధ్య సమన్వయ లోపం భక్తులపాలిట శాపమైందా? అందివచ్చిన అవకాశాన్ని TTD చేజేతులా జారవిడుచుకుందా? సర్వదర్శనం భక్తులకు మళ్లీ ఇక్కట్లు తప్పవా? టీటీడీ వైఫల్యం.. భక్తులకు చుక్కలు తిరుమల తిరుపతి దేవస్థానం అతిపెద్ద హిందు ధార్మిక సంస్థ. నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోంది. సాధారణ భక్తుడికి కూడా VIP భక్తుల తరహాలోనే శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. కానీ.. కొన్ని విషయాల్లో TTD వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.…