Dale Steyn departure from Sunrisers Hyderabad: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుండగా.. దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ కీలక ప్రకటన చేశాడు. బౌలింగ్ కోచ్‌గా తాను సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)ను వీడుతున్నట్లు తెలిపాడు. అయితే సౌతాఫ్రికా 20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు మాత్రం బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతానని వెల్లడించాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 2024లో ఎస్ఆర్‌హెచ్‌కు దూరమైన స్టెయిన్.. వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉండనని స్పష్టం చేశాడు.…