శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన ఘటన తిరుపతి వాసుల్లో కలకలాన్ని రేపింది. తాజాగా ఈ అంశంపై ఏపీ బీజేపీ స్పందించింది. "ఏడు కొండలు వాడా... స్వామి మమ్ముల్ని క్షమించు... భక్తకోటిని క్షమించండి. నీ దర్శనానికి వచ్చిన వారికి ఏర్పాట్లు చేయలేనందుకు మమ్ములను క్షమించు." అని కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని క్షమాపణలు కోరింది.
భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్, సనాతాన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చి నిర్మూలించాలనడం హైయమైన చర్య అని బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.