ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేడు కీలక సమావేశం నిర్వహించనుంది.. ఇవాళ ఉదయం 10 గంటలకు ఏపీ బీజేపీ నేతల కీలక భేటీ ప్రారంభం కానుంది.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ నేతృత్వంలో ఏపీ బీజేపీ ముఖ్యులు సమావేశం కానున్నారు.. అయితే, ఈ కీలక భేటీకి 45 మంది ముఖ్య నేతలకు మాత్రమే ఆహ్వానం అందింది..
రాబోయే ఎన్నికలకు ఈ సమావేశం చివరిది.. ఎన్నికలకు సమాయత్తయ్యేలా ఇవాళ, రేపు సమావేశాలు ఉంటాయని తెలిపారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జీల సమావేశం ప్రారంభం అయ్యింది.. ఈ కీలక సమావేశాల్లో మాట్లాడిన ఆమె.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా రెపరెపలాడుతుంది..
మేం జనసేనతో పొత్తులో ఉన్నాం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే చెబుతున్నారని మరోసారి క్లారిటీ ఇచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. కానీ, తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయం కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించడం లేదని అపవాదు వేస్తున్నారు.. మోడీ సర్కార్ భాగ్యస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగడం లేదు అని ఆమె అన్నారు.
కడప విమానానికి ఫుల్ ఆక్యుపెన్సీ ఉందంటే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. విశాఖలో భూముల దోపిడీ కోసం వాళ్ళంతా ఇక్కడకు వస్తున్నట్టు కనిపిస్తోంది అని ఆమె విమర్శలు గుప్పించారు. మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వంపై అబండాలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఎప్పుడు సమర్పించారో ప్రజలకు చెప్పాలి అని పురంధేశ్వరి ప్రశ్నించారు.
మన్యం జిల్లాలో సాగునీటి, తాగునీటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.. టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు అని ఆమె విమర్శలు చేశారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలి.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా దీవించాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు.
మోసపూరిత వాగ్దానాలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఆలోచించుకోవాలి అని పురందేశ్వరి కోరారు. ఇక్కడ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి తొమ్మిది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి మాట తప్పారు.
బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి పై కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఇవాళ కొడాలి నాని మాట్లాడుతూ.. టీడీపీకి బీ టీమ్ దగ్గుబాటి పురంధరేశ్వరి అని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ కి ద్రోహం చేసిన వారిలో ఆమె పాత్ర ఉందని, ఎన్టీఆర్ పదవిని.. breaking news, latest news, telugu news, kodali nani, ycp, daggubati purandeswari