Daggubati Purandeswari: రాబోయే ఎన్నికలకు ఈ సమావేశం చివరిది.. ఎన్నికలకు సమాయత్తయ్యేలా ఇవాళ, రేపు సమావేశాలు ఉంటాయని తెలిపారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జీల సమావేశం ప్రారంభం అయ్యింది.. ఈ కీలక సమావేశాల్లో మాట్లాడిన ఆమె.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా రెపరెపలాడుతుంది.. కొన్ని చోట్ల అధికారం పంచుకుంటుంది అన్నారు. ఇక, ఏపీ చేసిన మేలు ప్రజలకు వివరించే బాధ్యత పదాధికారులదే అన్నారు. వికసిత్ భారత్ ద్వారా కేంద్ర పథకాలను వివరిస్తున్నాం అన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా ఇవి కేంద్ర పథకాలను ప్రజలు తెలుసుకుంటున్నారు. పదేళ్లలో ప్రజలకు ఏం చేసేమో మనమే చెప్పాలి. రాష్ట్ర పరిస్ధితులను మనం బేరీజు చేసుకోవాలి అన్నారు.
Read Also: Shocking Viral Video : ఈ వీడియో చూస్తే చచ్చినా.. బయట ఫుడ్ తినరు
ఇక, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పులను రూ. 12 లక్షల కోట్లకు పైగా తీసుకెళ్లి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని మండిపడ్డారు పురంధేశ్వరి.. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. జగన్ ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం వెనుక ఒక స్కాం ఉందని ఆరోపించారు. డబ్బులు వేస్తూనే ప్రతి పథకంలో తమ వాటా ఉండే విధంగా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు.. రైతాంగం నైరాశ్యంలో కూరుకుపోయింది. మొన్న తుఫాను దాటికి రైతాంగం అనేక ఇబ్బందులు పడ్డారు. రైతు పార్టీ అని చెప్పుకునే వైసీపీ రైతాంగానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Devara: ఎన్టీఆర్ నమ్మకం విలువెంతో నిరూపిస్తాడు కొరటాల…
మరోవైపు, విశాఖలో మహిళపై పాశవికంగా అత్యాచారం చేయడం దుర్మార్గం అన్నారు పురంధేశ్వరి.. దిశ యాప్ ఉందని సీఎం గొప్పగా చెబుతున్నారు.. మహిళలు ఫోన్ ఊపుతూనే ఉన్నారే తప్ప మహిళలకు రక్షణ కొరవడిందని దుయ్యబట్టారు. ఇక, రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు రాలేదు. ఐదు లక్షల ఉద్యోగాలిస్తానని జగన్ హామీ ఇచ్చారు.. ఏమైంది ఆ మాట..? అని నిలదీశారు. ఎస్సీ నియోజకవర్గాల్లోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్లు పెత్తనం చెలాయిస్తున్నారు. రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా అవకాశ మిచ్చారని వైసీపీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గుర్తుచేశారు దగ్గుబాటి పురంధేశ్వరి.