నేడు విశాఖపట్నంలోని షీలానగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణాన్ని ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కడప విమానానికి ఫుల్ ఆక్యుపెన్సీ ఉందంటే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. విశాఖలో భూముల దోపిడీ కోసం వాళ్ళంతా ఇక్కడకు వస్తున్నట్టు కనిపిస్తోంది అని ఆమె విమర్శలు గుప్పించారు. మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వంపై అబండాలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఎప్పుడు సమర్పించారో ప్రజలకు చెప్పాలి అని పురంధేశ్వరి ప్రశ్నించారు.
Read Also: TS Junior Doctors: సెక్రటేరియట్ కు జూనియర్ డాక్టర్లు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో చర్చ
ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది స్టిక్కర్ ప్రభుత్వం మాత్రమే అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. టిడ్కొ ఇళ్లను కూడా కేటాయించలేని దయనీయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందీ అంటే పేదలను వంచించడమే.. టిడ్కొ ఇళ్లను తాకట్టు పెట్టి అప్పులు తెచేసింది.. తీసుకున్న అప్పుకు లబ్దిదారులకు ఇప్పుడు నోటీసులు వస్తున్నాయని ఆమె ఆరోపణలు చేశారు. ఇన్ఫోసిస్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారం ఏమీ లేదు.. అసలు వచ్చిన ఐటీ కంపెనీలను జగన్ సర్కార్ వెళ్ళగొట్టిందని పురంధేశ్వరి చెప్పారు. కోడి గుడ్లు మీద కూడా సీఎం జగన్ స్టిక్కర్లు వేసుకునే పరిస్థితి ఉంది.. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పాడింది.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే అంటూ పురంధేశ్వరి పేర్కొన్నారు.