బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి పై కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఇవాళ కొడాలి నాని మాట్లాడుతూ.. టీడీపీకి బీ టీమ్ దగ్గుబాటి పురంధరేశ్వరి అని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ కి ద్రోహం చేసిన వారిలో ఆమె పాత్ర ఉందని, ఎన్టీఆర్ పదవిని చంద్రబాబు కి పదవిని ఇప్పించింది దగ్గుబాటి అని ఆయన ఆరోపించారు. చంద్రబాబుతో కలిసి ఆయన సీఎం అవటంలో కీలక పాత్ర పోషించిందని, దగ్గుబాటి పురంధరేశ్వరి లాంటి కూతురు ఎవరికి ఉండదన్నారు కొడాలి నాని. చంద్రబాబు చేసిన ప్రతి అవినీతిలో ఆవిడ వాటా ఆమెకు వెళ్తోందన్నారు. చంద్రబాబు ఇసుక దోపిడీ లో కూడా ఆవిడకు వాటాలు వెళ్ళాయని కొడాలి నాని వ్యాఖ్యానించారు. జగన్ ఇసుక దోపిడీ అంటూ సిగ్గులేని ఆరోపణలు చేస్తోందని, 4 వేలు కోట్లు ఆదాయం జగన్ హయాంలో ఇసుక ద్వారా వచ్చిందన్నారు కొడాలి నాని.
Also Read : CPI Narayana: బీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడైనా ఒక్కటే..
బాబు హయాంలో ఇసుక ద్వారా రూపాయి ఆదాయం లేదని, 2014, 2019 ప్రజలు బుద్ధి చెప్పినా ఆవిడ మారలేదన్నారు. చంద్రబాబు కోర్టులో దొంగ అఫిడవిట్ లు ఇస్తున్నారన్నారు కొడాలి నాని. నిన్నటి వరకు అసెంబ్లీలో బాహుబలి డైలాగులు చెప్పిన చంద్రబాబు, నేడు గుండెకు బొక్క పడింది, శరీరంలో కాయలు పోయాయి అంటూ బెయిల్ కోసం డ్రామాలాడుతున్నాడన్నారు. చంద్రబాబు జీవితమంతా అవినీతి బొక్కలు, మచ్చలతో నిండిపోయిందని కొడాలి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతికి తావులేదని, పేద వర్గాల అభ్యున్నతే తమ లక్ష్యమన్నారు.
Also Read : DRDO Recruitment 2023: డీఆర్‌డీఓలో భారీగా ఉద్యోగాలు.. అర్హతలు, ఎంపిక వివరాలు..