Director Teja: టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోలను పరిచయం చేసిన ఘనత డైరెక్టర్ తేజ కే దక్కుతోంది. ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న కుర్ర హీరోలు తేజ చేతిలో పడి బయటికి వచ్చినవారే. ఇక తేజ గురించి చెప్పాలంటే.. కథలు ఎంత మంచిగా ఉంటాయో.. నటీనటుల నుంచి ఆ కథకు తగ్గట్టు నటనను రాబట్టుకోవడానికి కొద్దిగా మొరటు గా ప్రవర్తిస్తాడని టాలీవుడ్ టాక్.
Ahmisa: దగ్గుబాటి వారసుడు అభిరామ్ దగ్గుబాటి ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసే బాధ్యతను అందుకున్నాడు డైరెక్టర్ తేజ. ఇప్పటికే దగ్గుబాటి అభిరామ్.. వివాదాలతో చాలా ఫేమస్ అయ్యాడు.
అమ్మ కిచ్చిన మాటను, అమ్మాయి కిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు అనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం ‘అంతేనా… ఇంకేం కావాలి’. పవన్ కళ్యాణ్ బయ్యా ను హీరోగా పరిచయం చేస్తూ వెంకట నరసింహ రాజ్ దర్శకత్వంలో రవీంద్ర బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఝాన్వీ శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ అతిరధుల సమక్షంలో ప్రారంభమైంది. సీనియర్ నటులు మురళీ మోహన్ హీరో,…
Ahimsa దగ్గుబాటి వారసుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ. యంగ్ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి “అహింస” అని పేరు పెట్టారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతుండగా, దగ్గుబాటి వారసుడు సెట్స్ కు రాకుండా డైరెక్టర్ ను ముప్పుతిప్పలు పెడుతున్నాడని టాక్ నడుస్తోంది. అభిరామ్ సిల్లీ రీజన్స్ తో షూటింగ్ కు డుమ్మా కొడుతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ రూమర్…
దగ్గుబాటి కుటుంబ నుంచి మరో హీరో రానున్నాడు. దగ్గుబాటి నటవారసత్వంగా వెంకటేష్ హీరోగా అడుగుపెట్టాడు.. ఆయన అన్న సురేష్ బాబు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నిర్మాణ రంగంలోకి దిగాడు. ఇక తండ్రి, బాబాయ్ ల వారసత్వంగా దగ్గుబాటి రానా ఒక పక్క హీరోగా మరోపక్క నిర్మాతగా కొనసాగుతున్నాడు. తాజగా కుటుంబ వారసత్వంతో మరో దగ్గుబాటి ఇంటిపేరుతో ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. అతనే దగ్గుబాటి అభిరామ్.. సురేష్ బాబు చిన్న కొడుకు.. రానా తమ్ముడు. అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీ…
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ తమిళ చిత్రం ‘మానాడు’ తెలుగు డబ్బింగ్ తో పాటు అన్ని భాషల రీమేక్ రైట్స్ తీసుకున్న నేపథ్యంలో అందులో హీరోగా నటించేది ఎవరనే దానిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ కాకుండా రీమేక్ చేయబోతున్నట్టు, తమ నిర్మాణ భాగస్వామిగా ఏషియన్ ఫిలిమ్స్ వ్యవహరిస్తుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే.. ఈ రీమేక్ కు సంబంధించిన మిగిలిన వివరాలేవీ ఆయన…