Director Teja: టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోలను పరిచయం చేసిన ఘనత డైరెక్టర్ తేజ కే దక్కుతోంది. ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న కుర్ర హీరోలు తేజ చేతిలో పడి బయటికి వచ్చినవారే. ఇక తేజ గురించి చెప్పాలంటే.. కథలు ఎంత మంచిగా ఉంటాయో.. నటీనటుల నుంచి ఆ కథకు తగ్గట్టు నటనను రాబట్టుకోవడానికి కొద్దిగా మొరటు గా ప్రవర్తిస్తాడని టాలీవుడ్ టాక్. ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు తేజ చెంపదెబ్బ తిని యాక్టింగ్ నేర్చుకున్నవారే.. ఈ విషయన్నీ పలువురు హీరోలు మీడియా ముందే ఒప్పుకున్నారు. ఇక తాజాగా అదే లిస్టులోకి చేరాడట దగ్గుబాటి వారసుడు అభిరామ్. సురేష్ బాబు చిన్న కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ ను టాలీవుడ్ కు పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడు తేజ.
అహింస పేరుతో సినిమాను తెరకెక్కించాడు. ఎప్పుడో మొదలుపెట్టిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమా కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. సెట్ లో అందరి ముందు అభిరామ్ పై తేజ చేయి చేసుకున్నాడట. ఒక సీన్ లో ఎంత చెప్పినా అభిరామ్ సరిగ్గా చేయకపోయిసరికి విసిగిపోయిన తేజ.. అందరు చూస్తుండగానే అభిరామ్ చెంప చెళ్లుమనిపించాడట.. దీంతో పరువు పోయిందని అభిరామ్ షూటింగ్ కు వెళ్లనని భీష్మించుకుని కుర్చున్నాడట. ఇక చేసేదేం లేక సురేష్ బాబు మధ్యలో కలుగజేసుకొని ఇద్దరికీ సర్దిచెప్పి షూటింగ్ ను ఫినిష్ చేయించాడట. మరి ఈ వార్తలో నిజం ఉందో లేదో తెలియాలంటే ఈ సినిమా ప్రమోషన్స్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.