దగ్గుబాటి కుటుంబ నుంచి మరో హీరో రానున్నాడు. దగ్గుబాటి నటవారసత్వంగా వెంకటేష్ హీరోగా అడుగుపెట్టాడు.. ఆయన అన్న సురేష్ బాబు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నిర్మాణ రంగంలోకి దిగాడు. ఇక తండ్రి, బాబాయ్ ల వారసత్వంగా దగ్గుబాటి రానా ఒక పక్క హీరోగా మరోపక్క నిర్మాతగా కొనసాగుతున్నాడు. తాజగా కుటుంబ వారసత్వంతో మరో దగ్గుబాటి ఇంటిపేరుతో ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. అతనే దగ్గుబాటి అభిరామ్.. సురేష్ బాబు చిన్న కొడుకు.. రానా తమ్ముడు. అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో ఇవ్వాల్సి ఉండగా మధ్యలో కొన్ని కారణాల వలన అది వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు అభిరామ్ తెరంగేట్రాన్ని డైరెక్టర్ తేజ స్వీకరించాడు.
ఎంతో మంది టాలెంటెట్ యాక్టర్స్ ని తేజ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అందులో చాలా మంది టెక్నీషియన్ లతో పాటు పాపులర్ అయిన హీరోలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇక నేడు డైరెక్టర్ తేజ పుట్టినరోజు కావడంతో ఆయన దర్శకత్వంలో అభిరామ్ పరిచయమవుతున్నాడని తెలుపుతూ మేకర్స్ తెలుపుతూ ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అహింస అనే టౌటిల్ ని ఫైనల్ చేశారు. అభిరామ్ ముఖం కనిపించకుండా కళ్లవరకు ఓ బస్తా సంచితో కట్టేయగా బ్లడ్ కారుతున్న స్టిల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. తేజ సినిమాలు అంటేనే రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. మరి దగ్గుబాటి వారబ్బాయిని తేజ ఎలా చూపించనున్నాడో చూడాలి.