Dadisetti Raja: ఈనెల 15 నుంచి ఉత్తరాంధ్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్న నేపథ్యంలో వైసీపీ నేతలు విమర్శలు చేశారు. కాకినాడలో మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ప్రజాగర్జన డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని.. వారిలో ఒక్కరు గెలిచినా వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. అమరావతి పేరు చెప్పి తన బినామీలతో లక్షల కోట్లు దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రణాళికలో భాగంగానే…
Minister Dadisetti Raja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తునిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ స్వాతంత్ర్య స్ఫూర్తితో జనసేన స్థాపించలేదని ఆరోపించారు. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా కొమ్ముకాయడానికే పార్టీ స్థాపించాడని.. ప్రస్తుతం ఆ విధంగానే పవన్ అడుగులు వేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ విచిత్రమైన రాజకీయ రాజకీయాలు చేస్తున్నారని.. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పవన్ విన్యాసాలు ఉన్నాయని చురకలు అంటించారు. పవన్ అసలు నీకు స్వాతంత్య్రం…
కాకినాడ జిల్లాలో మంగళవారం జరిగిన వైసీపీ ప్లీనరీలో రోడ్డు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు తాము పెట్టిన చిన్న బచ్చా గాళ్లు అని.. వాళ్లు తమ మీద పెత్తనం చెలాయిస్తున్నారని చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. వాలంటీర్లను మనమే పెట్టామని.. మీకు నచ్చకపోతే తీసేయండి అంటూ కార్యకర్తలకు సూచించారు. వార్డు సచివాలయాలను కార్యకర్తలు కంట్రోల్‌లోకి తీసుకుని నడిపించాలి.. మిమ్మల్ని ఎవరూ వద్దని…
ఏపీలో తూర్పుగోదావరి రాజకీయాలు గోదావరి అంత ప్రశాంతంగా వుండవు. తుఫాన్ వచ్చినప్పుడు లంక గ్రామాల్ని ముంచేసినట్టుగా అక్కడ రాజకీయాలు హాట్ హాట్ గా వుంటాయి. తాజాగా జనసేన-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంగళగిరిలో జరిగిన జనసేన సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి దాడిశెట్టి రాజా కౌంటరేశారు. అంబేద్కర్ జిల్లా ప్రకటించినందుకు పవన్, చంద్రబాబు అల్లర్లు సృష్టించారన్నారు. మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు తగలబెట్టి చంద్రబాబు, పవన్ ఆ మంటల్లో చలికాసుకున్నారు. కోనసీమ అల్లర్లలో…
మాజీ ఆర్థిక మంత్రి యనమలకు తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తుని నుంచి యనమల కుటుంబం లేదా ప్రత్యర్ధి ఎవరైనా 15 వేలు మెజారిటీతో గెలుస్తాను. 15 వేల కంటే తక్కువ ఓట్ల మెజారిటీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని పేర్కొన్నారు. నాపై గెలుపు సంగతి అలాఉంచి నాకు 15వేలు మెజారిటీ రాకుండా చూసుకోండి అని సవాల్ విసిరారు. ఐటీజే తుని నియోజకవర్గంలో 64 ఎంపీటీసీలకు జరిగిన…