ఏపీని తుఫాన్‌లు వెంటాడుతున్నాయి. మొన్న ‘మొంథా’ తుఫాన్ మిగిల్చిన నష్టాలకు పరిహారం కూడా అందక మునుపే.. ‘దిత్వా’ తుఫాన్ దూసుకొచ్చింది. వాయుగుండం నుంచి అల్ప పీడనంగా బలహీనపడినప్పటికీ.. పలు జిల్లాలపై మాత్రం పెను ప్రభావం చూపింది. నవంబర్ 30న తుఫాన్ ప్రభావం మొదలైనప్పటికీ.. మొదటి మూడు రోజులు మోస్తరు వానలే పడ్డాయి. మంగళవారం (డిసెంబర్ 2) నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దిత్వా దెబ్బకు నెల్లూరు జిల్లా వణికిపోయింది. Also Read: Daily Horoscope: గురువారం…
Pakistan: సహాయంలో కూడా దాయాది దేశం పాకిస్తాన్ నీచంగా ప్రవర్తించింది. గడువు తీరిన సహాయ సామాగ్రిని అందించి, తన బుద్ధి ఏంటో మరోసారి నిరూపించుకుంది. దిత్వా తుఫాను కారణంగా అల్లకల్లోలంగా మారిని శ్రీలంకు సాయం చేస్తున్నామని చెబుతూ పాకిస్తాన్ హైకమిషన్ సహాయ ప్యాకేజీలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, వాటిపై ఎక్స్‌పైరీ డేట్ 10/2024గా ఉంది. దీంతో పాకిస్తాన్‌పై విమర్శలు వాన మొదలైంది. గడువు తీరిన ఆహారాన్ని అందించడంపై పాక్ వైఖరిని నెటిజన్లు…
Ditwah Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను వేగంగా తీరం వైపు చేరుకుంటోంది. చెన్నైకి తూర్పున కేవలం 50 కిలోమీటర్లు, తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కదులుతోంది. వాతావరణ శాఖ అర్ధరాత్రికల్లా ఇది మరింత దగ్గరగా, తీరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరం వరకూ చేరే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రేపు పలు జిల్లాల్లో వర్షాలు మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల వర్షపాతం నమోదవుతోంది. Read…
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో కొనసాగుతున్న ‘దిత్వా’ తుపాను తమిళనాడుపై పంజా విసురుతోంది. తమిళనాడులో శనివారం అర్దరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, రామనాథపురం,తంజావూరు, తిరువారూరు, కోయంబత్తూరులో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 62కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై-శ్రీలంక విమాన సర్వీలు రద్దయ్యాయి. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరంలో దిత్వా తుఫాన్ కొనసాగుతోంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా…
శ్రీలంకపై దిత్వా తుఫాన్ విరుచుకుపడింది. భారీ ఈదురుగాలులతో కుండపోత వర్షం కురిసింది. దీంతో శ్రీలంక అతలాకుతలం అయింది. పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో ఇప్పటి వరకు 123 మంది ప్రాణాలు కోల్పోయారు.
దిత్వా తుఫాన్ తమిళనాడులో బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తుఫాను ఆదివారం తెల్లవారుజామున ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాన్ ఏర్పడింది. ప్రస్తుతానికి ఇది ట్రింకోమలీ (శ్రీలంక)కి 80 కి.మీ, పుదుచ్చేరికి 480 కి.మీ, చెన్నైకి 580 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 8 కి.మీ వేగంతో తుపాన్ కదిలింది. ఎల్లుండికి నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. దిత్వా తుపాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు…
Cyclone Ditwah: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ భారత్ వైపు కదులుతోంది. దిట్వా తుఫాను ముంచుకొస్తుండటంతో తమిళనాడు హై అలర్ట్ అయింది. తుఫాన్ శ్రీలంక తీరప్రాంతం మీదుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానిని అనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వాయువ్య దిశగా కదులుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తుఫానుకు యెమెన్ దేశం దిట్వా తుఫానుగా పేరు పెట్టింది. Read Also: Anjali Sharma: ఆఫ్రికన్ జాతీయుడిని వివాహం చేసుకున్న హిమాచల్ పర్వతారోహకురాలు.. మొదటగా ఎక్కడ…
Cyclone Alert: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా మారి తుఫాన్‌గా మారిందని.. దానికి ‘దిత్వా’గా నామకరణం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో 15 కిలో మీటర్ల వేగంతో కదులుతూ తుపాన్ ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)కు 200 కిలో మీటర్లు.. పుదుచ్చేరికి 610 కిలో మీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా సుమారు 700 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.. Read…