Cyclone Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్.. ‘దిత్వా’గా నామకరణం.. ఏపీకి భారీ వర్ష సూచన..
- నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తుపాన్..
- తుపాన్ కు 'దిత్వా' గా నామకరణం..
- గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో కదిలిన తుపాన్..
- ఆదివారం తెల్లవారుజాముకి నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి..
- దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ..
- దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Alert: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా మారి తుఫాన్‌గా మారిందని.. దానికి ‘దిత్వా’గా నామకరణం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో 15 కిలో మీటర్ల వేగంతో కదులుతూ తుపాన్ ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)కు 200 కిలో మీటర్లు.. పుదుచ్చేరికి 610 కిలో మీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా సుమారు 700 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది..
Read Also: Imran Vs Asim: ఒక్క సంతకం.. ఇమ్రాన్‌కు మరణశాసనం!
Also Read
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
అయితే, వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ తుపాన్ ఆదివారం తెల్లవారుజామున తీరాన్ని తాకనుంది.. ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలకు చేరువలో తీరం దాటే అవకాశం ఉండగా… ఏపీలో వర్షాలు, గాలుల ప్రభావం పెరుగుతుందని అంచనా వేసింది.. ఇక, తుపాన్ ప్రభావంతో శనివారం మరియు ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.. తీరం ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని.. సముద్రం ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఈ సమయంలో ప్రజలు–రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు సూచనలు జారీ చేసింది.. ఈ సమయంలో సముద్రానికి వెళ్లవద్దు.. మత్స్యకారులు చేపల వేటకు బయలుదేరకుండా ఉండాలి.. తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.. వరి, పత్తి, మిరప తదితర పంటల రైతులు వెంటనే రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది.. తుపాన్ తీరానికి చేరే వరకు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!