Bengaluru and Hyderabad: బెంగళూరు.. హైదరాబాద్.. మన దేశంలోని ఐటీ రంగంలో దూసుకెళుతున్న నగరాలు. ఇది.. నాణేనికి ఒక వైపైతే.. మరో వైపు.. ఈ రెండు సిటీలు సైబర్ నేరాల్లో కూడా లీడింగ్‌లో ఉన్నాయి. 2021వ సంవత్సరంలో మొత్తం 52 వేల 974 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా ఇందులో సగం కేసులు కేవలం కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లలోనే రిజిస్టర్ అయ్యాయి. ఈ లేటెస్ట్ వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.