ఉడా చిల్డ్రన్స్ ఎరినా థియేటర్ లో జిల్లా పోలీస్ యంత్రాంగంతో డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖలో క్రైమ్ రేట్ తగ్గింది…లోక్ అదాలత్ లో 47 వేల FIR కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. లక్ష వరకు పెట్టీ కేసులు పరిష్కారం అయ్యాయి. సుమారు 1,500 కేసుల్లో 1,30,000 కేజీల గంజాయి పట్టుకున్నామన్నారు డీజీపీ. AOB లో మావోయిజం యాక్టివ్ లో ఉంది. లోన్ యాప్స్ పై ప్రత్యేక SOB రెడీ చేస్తున్నాం. సైబర్ కేసులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం అన్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.
Read Also: Prakash Raj: నటులకి ఆ భయం పట్టుకుంది.. అందుకు నేను సిద్ధమే
ఎయిర్ పోర్టులో వరుస ఘటనలు జరగడంతో చర్యలు చేపట్టాం. పోలీసులపై ఏవిధమయిన ఒత్తిళ్ళు ఉండవన్నారు. సైబర్ క్రైమ్ సెల్ ను మరింత అప్ గ్రేడ్ చేస్తున్నాం. ఆపరేషన్ పరివర్తన్ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. 3500 ఎకరాల్లో గిరిజనులు ప్రత్యామ్నాయ పంటలు వేసారని వివరించారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని డీజీపీ తెలిపారు.
అలిపిరిలో డీఐజీ తనిఖీలు
అలిపిరి పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీలు నిర్వహించాం. అలిపిరి పీఎస్ పరిధిలో భక్తుల ముసుగులో గుర్తు తెలియని వ్యక్తులు అధికంగా ఉంటారు.భోజనం, వసతి సౌకర్యాలు ఉండటంతో నిందితులు భక్తుల ముసుగులో ఉంటారు. గతంతో పోల్చితే అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు తగ్గాయి.ఈ స్టేషన్ పరిధిలో భూతగాదాలు అధికంగా ఉన్నాయి. లోన్ యాప్ ల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు పెంచుతున్నాం. తిరుపతి నగరంలో నేరాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 100 కి కాల్ వచ్చిన 5 నిమిషాల్లో పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారని తెలిపారు అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాశ్.