IBomma Ravi : హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో మరోసారి కీలక వివరాలను వెలికితీశారు. పైరసీ వ్యవహారాన్ని పూర్తిగా తన అసలైన గుర్తింపుకి దూరంగా ఉంచాలని రవి ముందుగానే నిర్ణయించుకున్నట్లు విచారణలో స్పష్టం అయింది. ఇందుకోసం అతడు ‘ప్రహ్లాద్’ పేరుతో పూర్తిగా ఫేక్ ఐడెంటిటీని సృష్టించుకుని, ఆ పేరుతో వివిధ పత్రాలు, బ్యాంకింగ్ వ్యవస్థలు, కంపెనీ రిజిస్ట్రేషన్లను నిర్వహించాడు. రవి ప్రహ్లాద్ పేరుతోనే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడంతో పాటు,…
Mule Accounts : హైదరాబాద్‌లో భారీ స్థాయిలో జరిగిన సైబర్ మోసాన్ని నగర పోలీసులు బట్టబయలు చేశారు. అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి వద్దకు అనుమానాస్పద కాల్ రావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ‘బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇస్తే డబ్బులు ఇస్తాం’ అని ఎవరో తనను సంప్రదిస్తున్నారని ఆ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆధారంతో ముందుకు సాగిన విచారణలో రాజస్థాన్‌కు చెందిన కన్నయ్య…
iBomma Operator Ravi Arrested: పోలీసులకే ఛాలెంజ్ విసిరిన ఐ బొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఎయిర్పోర్టులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. సినీ పరిశ్రమతో పాటు పోలీసు అధికారుల జీవితాలు బట్టబయలు చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేశాడు ఐబొమ్మ నిర్వాహకుడు రవి.. తన వెబ్సైట్పై కన్ను వేస్తే అందరి జీవితాలు రోడ్డుపై వేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.. గత ఆరు నెలలుగా ఐ బొమ్మ నిర్వాకుడు రవి కోసం పోలీసులు…
Honeytrap: యోగా గురు.. హనీ ట్రాప్‌లో పడ్డాడు. ఏకంగా 50 లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. కానీ అవతలి వ్యక్తులకు ధనదాహం తీరకపోవడంతో మరో 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని వేధించారు. దీంతో యోగా గురు పోలీసులను ఆశ్రయించాడు. ఫలితంగా ముఠా ఆట కట్టించారు పోలీసులు. ఆయన పేరు రంగారెడ్డి. స్వయంగా ఆయన ఓ రాజకీయ నాయకుడు.. అంతే కాదు ఒక యోగా టీచర్‌గానూ సేవలందిస్తున్నారు. దీనికి తోడు ఓ వెల్ నెస్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు.…
Honey Trap: హైదరాబాద్‌లో మరోసారి ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా మోసం జరిగింది. హింజ్ (Hinge) అనే డేటింగ్ యాప్‌లో శివాని పేరుతో ఓ యువతితో పరిచయం పెంచుకున్న ఒక యువకుడు సైబర్ నేరగాళ్లకు బలయ్యాడు. అమ్మాయి పూణే నుంచి హైదరాబాద్‌కు వచ్చానని, మూడు రోజుల పాటు నగరంలో ఉంటానని చెప్పి బుట్టలో వేసుకుంది. ఆ తర్వాత తరచూ వీడియో కాల్ చేస్తూ అతడి ఫోటోలను సేకరించింది. ఆపై వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి అందరికీ షేర్…
సైబర్ నేరగాళ్ల తోకలు కత్తిరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. వాళ్లకి మ్యూల్ అకౌంట్లు సమకూర్చిన నేరగాళ్లను గుర్తించారు. మొత్తంగా ఆరుగురిపై కేసులు పెట్టిన పోలీసులు.. తాజాగా ఒకరిని ముంబై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నారు. మొన్ననే 25 మంది సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరో ముఠా బాగోతాన్ని బయట పెట్టారు. సైబర్ క్రిమినల్స్‌కు బ్యాంక్ అకౌంట్లు అందిస్తున్న నేరగాళ్లను గుర్తించారు.. ఇటీవల హైదరాబాద్‌లో ఉంటున్న…
స్మార్ట్ ఫోన్లు వచ్చాక సైబర్ నేరగాళ్ల పని ఈజీ అవుతోంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సులభంగా జనాన్ని బురిడీ కొట్టించేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. మరోవైపు సైబర్ వలకు చిక్కిన అమాయకులు.. డబ్బులు నష్టపోవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డులో ఓ మహిళ సైబర్ నేరగాళ్లకు చిక్కి ఉసురు తీసుకుంది. ఆన్‌లైన్‌లో అమాయకులు తగిలితే చాలు.. ఇట్టే మోసం చేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించడంపై అందరికీ ఆసక్తిగానే ఉంటుంది.…