Mule Accounts : హైదరాబాద్‌లో భారీ స్థాయిలో జరిగిన సైబర్ మోసాన్ని నగర పోలీసులు బట్టబయలు చేశారు. అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి వద్దకు అనుమానాస్పద కాల్ రావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ‘బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇస్తే డబ్బులు ఇస్తాం’ అని ఎవరో తనను సంప్రదిస్తున్నారని ఆ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆధారంతో ముందుకు సాగిన విచారణలో రాజస్థాన్‌కు చెందిన కన్నయ్య అనే వ్యక్తి ఈ ముఠా ప్రధాన నిందితుడని బయటపడింది.
హైదరాబాద్‌లోని ఓ ఆటో డ్రైవర్‌ను కన్నయ్య మాటల్లో పెట్టి, కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తానని, లావాదేవీలన్నీ తానే చూసుకుంటానని చెప్పాడు. ఇందుకు 10 వేల రూపాయలు కూడా ఇచ్చాడు. ఆ తర్వాత మరిన్ని అకౌంట్లు తెస్తే ఇంకా డబ్బులు ఇస్తానని చెప్పడంతో, ఆ ఆటో డ్రైవర్ తన భార్య, బంధువులు, స్నేహితుల ఫోటోలు, గుర్తింపు కార్డులు అందించాడు. కన్నయ్య వీరందరి పేర్లతో అకౌంట్లు ఓపెన్ చేయించాడు. ఈ అకౌంట్‌లను ఓపెన్ చేయడంలో జూబ్లీహిల్స్ కరూర్ వైశ్య బ్యాంక్‌కి చెందిన బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ బాలాజీ నాయక్ కీలక పాత్ర పోషించాడు. ఒక్కో అకౌంట్ ఓపెన్ చేసినందుకు 15 వేలు చొప్పున ఇచ్చారని, అందులో బాలాజీ నాయక్‌కూ వాటా ఉందని పోలీసులు తెలిపారు.
Akhanda 2 : ఇద్దరు సీఎంలను రంగంలోకి దించుతున్న బాలయ్య..?
ఇలా మొత్తం 127 బ్యాంక్ అకౌంట్లు తెరిపించిన తర్వాత, కన్నయ్య ఈ అకౌంట్‌ల సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు ఇచ్చాడు. పలు రాష్ట్రాల్లో ఆపరేటింగ్ చేసే సైబర్ క్రైమ్ ముఠాలు ఈ అకౌంట్లకు వచ్చిన డబ్బులను బదిలీ చేస్తూ, మొత్తం 24 కోట్ల రూపాయలు కొల్లగొట్టాయి. అందులో 23.9 కోట్ల రూపాయలను విత్‌డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 6 కేసుల్లో ఈ భారీ మోసం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్‌తో కలిసి పోలీసులు పెద్ద ఎత్తున చేసిన శోధనల్లో 11 పాస్‌బుక్‌లు, 14 ఏటీఎం కార్డులు, 12 చెక్‌బుక్‌లు, 6 సిమ్ కార్డులు, 30 బ్లూ డార్ట్ కొరియర్ రిసిప్ట్‌లు, ఒక బయోమెట్రిక్ డివైజ్, సామ్‌సంగ్ ట్యాబ్, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో పాల్గొన్న ఆటో డ్రైవర్లు పూజారి జగదీష్, సునీల్ కుమార్, మణిదీప్, బ్లూ డార్ట్ డెలివరీ బాయ్ నిఖిల్, హార్డ్‌వేర్ టెక్నీషియన్ బాలు, ఫోటోగ్రాఫర్ బత్తుల పవన్, ప్రవీణ్, అలాగే బ్యాంక్ ఉద్యోగి బాలాజీ నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రధాన నిందితులు అన్న రాజస్థాన్‌కి చెందిన కన్నయ్య, రమేష్, పూనమ్ ఇంకా పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
Tata Sierra: ధరల విషయంలో నిన్ను కొట్టేవాడు లేడు.. టాటా సియోర్రా ధర, బుకింగ్స్, డెలివరీ..