IBomma Ravi : ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి
- ప్రహ్లాద్ పేరుతో ఫేక్ ఐడెంటిటి సృష్టించిన ఐబొమ్మ రవి
- 20 సర్వర్లు, 35 డొమెయిన్‌లతో భారీ పైరసీ నెట్‌వర్క్
- ఫిలిం ఛాంబర్.. పోలీసులకు పంపిన బెదిరింపు ఈమెయిల్స్‌పై సాక్ష్యాలు
- బెట్టింగ్ యాప్స్ , ఆర్థిక లావాదేవీలపై మరింత దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IBomma Ravi : హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో మరోసారి కీలక వివరాలను వెలికితీశారు. పైరసీ వ్యవహారాన్ని పూర్తిగా తన అసలైన గుర్తింపుకి దూరంగా ఉంచాలని రవి ముందుగానే నిర్ణయించుకున్నట్లు విచారణలో స్పష్టం అయింది. ఇందుకోసం అతడు ‘ప్రహ్లాద్’ పేరుతో పూర్తిగా ఫేక్ ఐడెంటిటీని సృష్టించుకుని, ఆ పేరుతో వివిధ పత్రాలు, బ్యాంకింగ్ వ్యవస్థలు, కంపెనీ రిజిస్ట్రేషన్లను నిర్వహించాడు.
రవి ప్రహ్లాద్ పేరుతోనే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడంతో పాటు, అనేక కంపెనీలు ఓపెన్ చేసి, అలాగే డొమెయిన్‌లు, బ్యాంక్ ఖాతాలు కూడా అదే పేరుతో నిర్వహించినట్టు పోలీసులు వెల్లడించారు. పైరసీ కార్యకలాపాలు ఎక్కడా తన ఒరిజినల్ ఐడెంటిటీకి కనెక్ట్ కాకుండా ఉండేందుకు ఈ పూర్తి వ్యవస్థను రూపొందించాడని విచారణలో తేలింది. ఇమంది రవి పైరసీ నెట్‌వర్క్‌ను నడిపించేందుకు 20 సర్వర్లు, 35 డొమెయిన్‌లు కొనుగోలు చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. దీంతో అతడు నిర్వహించిన పైరసీ వ్యూహం ఎంత పెద్ద స్థాయిలో నడుస్తోందో స్పష్టమవుతోంది. సినిమాల రికార్డింగ్, అప్‌లోడింగ్, డౌన్‌లోడింగ్ వంటి అక్రమ కార్యకలాపాలను ఈ నెట్‌వర్క్ ద్వారా నిర్వహించినట్టు ఆధారాలు బయటపడ్డాయి.
Also Read
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
అంతేకాదు, రవి పంపిన పాత బెదిరింపు ఈమెయిల్స్ కూడా మరింత స్పష్టతనిస్తున్నాయి. ఫిలిం ఛాంబర్ , పోలీసులకు రెండు నెలల క్రితం పంపిన బెదిరింపు ఈమెయిల్, రవి వ్యక్తిగత ఈమెయిల్ ఐడీలోనే ఉన్నట్లు సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించారు. దీంతో అతని పాత్రపై మరింత బలమైన ఆధారాలు లభించాయి. ఇంకా బెట్టింగ్ యాప్స్ , ఇతర ఆర్థిక లావాదేవీలపై కూడా అనుమానాలు ఉన్న నేపథ్యంలో, ఈ కోణంలో దర్యాప్తు కొనసాగించాలని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. పైరసీకి మాత్రమే కాకుండా, ఇతర అక్రమ లావాదేవీలకు కూడా రవి సంబంధం ఉన్న అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఐబొమ్మ రవి కస్టడీ విచారణ కొనసాగుతున్న కొద్దీ, మరిన్ని సంచలన వివరాలు వెలుగులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
Smriti and Palash: స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ ఒకే ఎమోజీ.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చినట్టేనా..?
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?