Train Incident: ఓడిశాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి గువాహటి వెళ్తున్న కామాఖ్యా ఎక్స్‌ప్రెస్ (12251) రైలు 11 బోగీలు పట్టా తప్పాయి. ఈ ఘటన గత రాత్రి 11.54 గంటల సమయంలో కటక్ సమీపంలోని నేరగుండి స్టేషన్ (ఖుర్దా డివిజన్) వద్ద చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే, అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్‌ఓ అశోక్ కుమార్ మిశ్రా…
కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా రెడీ అయింది. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది
Odisha: ఒడిశాలోని కటల్‌లో జరిగిన మిలాద్-ఉన్-నబీ వేడుకలు వివాదాస్పదంగా మారాయి. ఊరేగింపు సందర్భంగా ఓ వ్యక్తి పాలస్తీనా జెండాను ప్రదర్శించడం ఉద్రిక్తతలను పెంచింది. సోమవారం నగరంలో ఊరేగింపు సందర్భంగా ఈ ఘటన జరిగింది. పాలస్తీనా జెండా ఊపుతూ ఓ వ్యక్తి కనిపించడంతో కొద్దిసేపు ఊరేగింపుని పోలీసులు నిలిపేశారు. ఈ ఘటన నగరంలోని దర్గా బజార్‌లో జరిగినట్లు వారు తెలిపారు.
:ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్ నమ్మకుంటే పలు ప్రమాదాలు ఎదురయ్యాయి. కొన్ని రోజుల క్రితం కేరళలో నావిగేషన్ మ్యాప్ ఉపయోగించుకుంటూ వెళ్తే, ఏకంగా కారు నదిలో కొట్టుకుపోయింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ ఒడిశాలోని కటక్-భువనేశ్వర్‌లోని ఆసుపత్రులను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న ట్రిపుల్ రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించే అవకాశం ఉంది.
ఒడిశాలోని కటక్ జిల్లాలో శనివారం జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారని, వారిలో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉందని పోలీసులు తెలిపారు.
Cuttack crime news : ఒడిశాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు బైక్‌కి కట్టేసి 3 కి.మీల దూరం ఈడ్చుకెళ్లారు. తీసుకున్న రూ. 1500 అప్పును సమాయానికి చెల్లించలేదన్న కారణంగా ఇలా చేశారు.
కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగారు.ఇషాన్ కిషన్(34), శ్రేయాస్ అయ్యర్ (40) మినహా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు షాకుల మీదు షాకులు తగిలాయి. రుతురాజ్ గైక్వాడ్ (1), రిషబ్ పంత్ (5), హార్డిక్ పాండ్యా (9), అక్షర్ పటేల్(10) ఇలా వచ్చి అలా వెళ్లారు. టీమిండియా 140…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు భువనేశ్వర్‌లో చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కాన్వాయ్‌పై కాంగ్రెస్ పార్టీకి చెందిన స్టూడెంట్స్ విభాగం నేతలు కోడి గుడ్లతో దాడి చేశారు. ఆయన భువనేశ్వర్ నుంచి కటక్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మంత్రి కాన్వాయ్‌ను ముందుకు వెళ్లకుండా విద్యార్థి నాయకులు నల్ల బ్యాడ్జీలను ప్రదర్శించి అడ్డుకున్నారు. లఖింపుర్‌ఖేరి హింసాత్మక ఘటనలో అజయ్ మిశ్రా కొడుకు, ఆశిష్ మిశ్రా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆశిష్ మిశ్రాపై రైతుల పైకి…