Cuttack crime news : అప్పు చెల్లించలేదని.. బైక్‌కు కట్టి 3కి.మీ ఈడ్చుకెళ్లాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cuttack crime news : ఒడిశాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు బైక్‌కి కట్టేసి 3 కి.మీల దూరం ఈడ్చుకెళ్లారు. తీసుకున్న రూ. 1500 అప్పును సమాయానికి చెల్లించలేదన్న కారణంగా ఇలా చేశారు. ఒడిశాలోని కటక్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తన తాత చనిపోవడంతో ఖర్చుల కోసం బాధిత యువకుడు జగన్నాథ్ కొన్ని రోజుల క్రితం నిందితుల వద్ద రూ. 1500 మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా తిరిగి చెల్లించకపోవడంతో ఆదివారం రాత్రి మరో ఐదుగురు స్నేహితులతో కలిసి వచ్చిన అప్పిచ్చిన వ్యక్తి.. యువకుడితో గొడవకు దిగాడు. అతడిని చితకబాదాడు. అనంతరం 12అడుగుల తాడుతో జగన్నాథ్ చేతులను కట్టేశారు. తాడును బైక్‌కి కట్టారు. 20 నిమిషాల పాటు.. 2కి.మీల కన్నా ఎక్కువ దూరం నడిపించారు.
Read Also: Newyork : అమెరికాలో విషాదం.. ట్రెక్కింగ్ చేస్తూ గుంటూరు వాసి మృతి
Also Read
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
కటక్‌లోని స్టువర్ట్పట్నా స్క్వేర్ నుంచి సుతాహట్ స్క్వేర్ వరకు బైక్వెనక పరిగెత్తాడు జగన్నాథ్. చివరికి కొందరు స్థానికులు చొరవ చూపించి, అతడిని విడిపించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు జగన్నాథ్. కిడ్నాప్, అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. బైక్‌ని, తాడును కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ట్రాఫిక్పోలీసులు.. నిందితులను ఎందుకు అడ్డుకోలేదు? అన్న కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను అందరూ చూస్తున్నా ఎవరూ జోక్యం చేసుకోకపోవడం గమనార్హం. ట్రాఫిక్ పోలీసులు చూసి కూడా అడ్డుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విషయం వెలుగులోకి రావడంతో స్పందించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఇద్దరు నిందితులను గుర్తించామని, మిగతా వారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
- Tags
- bike
- Crime News
- Cuttack
- Rs.1500
- streets
తాజావార్తలు
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!