HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఐదుగురు నిందితులు 14 రోజుల రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులను మరింతగా విచారించాల్సిన అవసరం ఉందంటూ, తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) కస్టడీ పిటిషన్‌ను మల్కాజ్‌గిరి కోర్టులో దాఖలు చేసింది. సీఐడీ తమ పిటిషన్‌లో నిందితులను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరింది. ఈ…
Child Trafficking Case: హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి వందన అనే మహిళను అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాదులో అమ్మినట్లు గుర్తించారు.
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక, పోలీసుల పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది.
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తైన తర్వాత ఏసీబీ కోర్టు గంట పాటు కేసును వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. రేపు (శుక్రవారం) ఉదయం గం.10.30 సమయానికి ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును విచారించేందుకు కస్టడీకి అనుమతించాలని ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు సాయంత్రమే దీనిపై తీర్పు వస్తుందని అంతా భావించారు. మొదట ఈ కేసు తీర్పును 10 నిమిషాలు వాయిదా వేసిన న్యాయమూర్తి.. ఆ తరువాత రేపు తీర్పు వెల్లడిస్తానని తెలిపారు.