ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి రానున్నది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతుంది. జనవరి 18 నుంచి 31 వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతుంది. నైట్ కర్ఫ్యూతో పాటు కొన్ని కొత్త నిబంధనలను కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం…
ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ తో పాటు వీకెండ్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బాటలో ఇప్పుడు రాజస్థాన్ కూడా అడుగులు వేస్తున్నది. రాజస్థాన్‌లో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో 5660 కొత్త కేసులు నమోదవ్వగా ఒకరు మృతిచెందారు. రాష్ట్రంలో 19,467 యాక్టీవ్ కేసులు ఉండగా, 24 గంటల్లో 358 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, కేసులు క్రమంగా పెరుగుతుండటంతో అశోక్ గెహ్లాట్ సర్కార్…
యూపీలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. జనవరి 6 వ తేదీ నుంచి జనవరి 14 వరకు సెలవులు ప్రకటించింది. యూపీలో యాక్టీవ్ కేసులు 3 వేలు దాటటంతో ఈ నిర్ణయం తీసుకున్నది. అంతేకాకుండా నైట్ కర్ఫ్యూ సమయాన్ని కూడా ప్రభుత్వం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉన్న కర్ఫ్యూను మరో రెండు గంటలు పొడిగించింది. రాట్రి 10…
ఢిల్లీలో కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎల్లో అలర్ట్‌ను అమలు చేస్తున్నారు. నైట్ కర్ఫ్యూ అమలు చేస్తూ, స్కూళ్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు, పార్కులను మూసేసిన సంగతి తెలిసిందే. 50 శాతం సీటింగ్‌తో రెస్టారెంట్, బార్లు నడుస్తున్నాయి. మెట్రోను కూడా 50 శాతం సీటింగ్‌తోనే నడుపుతున్నారు. కానీ, పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. పాజిటివిటీ రేటు 6 శాతం దాటిపోవడంతో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. Read: శ్రీకృష్ణుడు…
యూరప్, అమెరికా దేశాల్లో ఒమిక్రాన్ కారణంగా కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజువారీ కేసులు, మరణాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, గత రెండేళ్లుగా దక్షిణాఫ్రికాలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా కేసుల కారణంగా నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. సౌతాఫ్రికాలో నాలుగో వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఎట్టకేలకు నైట్ కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ప్రజల రాకపోకలపై…
దేశంలో కోవిడ్ ముప్పు తొలగడం లేదు. గత కొంతకాలంగా తక్కువగా నమోదవుతున్న కేసులు తిరిగి పెరగడం ప్రారంభించాయి. క్రమంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళన పెంచుతున్నాయి. తాజాగా 9195 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 77,002 వున్నాయి. మరోవైపు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి ఒమిక్రాన్ వేరియంట్ కేసులు. దేశంలో మొత్తం 781 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ లో అత్యధికంగా 238 కేసులు నమోదు కావడంతో ఆందోళన కలుగుతోంది. నిన్నటి “కోవిడ్” కేసులు…
దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆగస్టు 15 వ తేదీ ఆదివారం రోజున స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగంగా నిర్వహించుకుంటుంటే, మేఘాలయ రాష్ట్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా అలజడులు జరిగాయి. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఆందోళనలు జరిగాయి. నేషనల్ లిబరేషనల్ కౌన్సిల్ మాజీ నేత థాంగ్‌కీ ఎన్‌కౌంటర్‌తో ఒక్కసారిగి షిల్లాంగ్ అట్టుడికిపోయింది. ఆందోళన కారులు రోడ్లపైకి వచ్చి వాహనాలను ధ్వంసం చేశారు. ఇటీవలే లైతుంఖ్రా వద్ద జరిగిన బాంబు దాడుల్లో థాంగ్‌కీ హస్తం ఉందనే అనుమానాలు కలగడంతో ఆయన్న…
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దీంతో పొరుగునున్న రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కర్ణాటక రాష్ట్రం కరోనాను కట్టడి చేసే క్రమంలో ఆంక్షలు విధించేందుకు సిద్ధమయింది. రాత్రిసమయంలో కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర్ విభాగాలకు నైట్ కర్ఫ్యూ నుంచి సడలింపులు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే…