Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు నగరాలు, పట్టణాల పేర్లను మార్చారు. లఖింపూర్ ఖేరీ జిల్లాలోని ముస్తఫాబాద్ గ్రామ పేరును ‘‘కబీర్ ధామ్’’గా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకున్నట్లు సీఎం యోగి చెప్పారు.
University : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (SSCTU) లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సాంస్కృతిక వారసత్వం, సంచార జాతుల ప్రజలు నివసించే ప్రాంతంలో ఏర్పాటు అవుతూ, అత్యుత్తమ రీసెర్చ్-ఆధారిత యూనివర్సిటీగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. “జ్ఞానం పరమం ధ్యాయం” అనే నినాదంతో ఈ విశ్వవిద్యాలయం అనువర్తిత, పరిశోధన , ఆవిష్కరణలకు కేంద్రంగా…
మహిళలు తమలో ఆత్మవిశ్వాసం పెంచుకున్నపుడే తాము అనుకున్న లక్ష్యాలను సాధించగలరు అని బాలీవుడ్ తార వామికా గబ్బి అభిప్రాయపడ్డారు. దక్షిణ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నాల్లో భాగంగా చేపట్టిన మిస్ ఇండియా యూకే ప్రాజెక్టును నగరంలోని బంజారాహిల్స్ తాజ్ డెక్కన్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిస్ ఇండియా యూకే లాంటి కార్యక్రమాల ద్వారా మహిళలు తమలో నైపుణ్యం గురించి ప్రపంచానికి తెలియజేయవచ్చు అన్నారు. ప్రాజెక్టు నిర్వాహకులు స్టార్‌డస్ట్ పేజెంట్స్ ప్రతినిధులు…
నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి మరోసారి రాముడి జన్మస్థలంపై చర్చను ప్రారంభించారు. రాముడు, శివుడు, విశ్వామిత్రుడు వంటి దేవతలు నేపాల్ లోనే పుట్టారని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాఠ్‌మాండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఓలి పాల్గొని ప్రసంగించారు. శ్రీరాముడు నేపాల్ లోనే జన్మించాడని పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ప్రచారం చేయడంతో దేశ ప్రజలు వెనకడుగు వేయొద్దన్నారు.
కన్నప్ప హైదరాబాద్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మానందం మాట్లాడిన మాటలను మరోసారి ప్రస్తావించిన ఆయన కన్నప్ప కేవలం సినిమా మాత్రమే కాదు ఇది భక్తి గురించి, ఒక మూమెంట్ గురించి, ఒక కల్చర్ గురించి, మన దేశ హెరిటేజ్ గురించి చేసిన సినిమా అని చెప్పుకొచ్చారు. మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలి బ్రహ్మానందం గారు చెప్పినట్టు మీరందరూ వెళ్లి సినిమాని చూడండి. Also Read:Ghaati : ‘ఘాటీ’…
సీతారాముల కల్యాణం కన్నులు పండుగ జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేదికపై నుంచి సీతారాముల కల్యాణం తిలకించారు. అనంతరం వేడుకును ఉద్దేశించి ప్రసంగించారు. పరిపాలన అంటే రామ పాలన జరగాలని అందరూ కోరుకుంటారన్నారు. "తండ్రి మాటకు కట్టుబడి వనవాసం వెళ్లారు.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒంటిమిట్ట లో జరుపుకుంటున్నాము.
Holi 2025 : హోలీ పండుగ ప్రేమ , సామరస్యానికి చిహ్నం. హోలీ అనేది రంగులతో ఆడుకునే పండుగ మాత్రమే కాదు, ఇది భారతదేశ గంగా-జముని సంస్కృతి యొక్క ఉమ్మడి వారసత్వాన్ని కూడా ప్రదర్శిస్తుంది. నేటి రాజకీయ యుగంలో, హోలీపై రాజకీయాలు హిందూ-ముస్లిం పేరుతో వేడెక్కుతున్నప్పటికీ, మీరు చరిత్రను పరిశీలిస్తే, అందరూ కలిసి హోలీ పండుగను జరుపుకుంటున్న అనేక ప్రదేశాల గురించి ప్రస్తావించబడుతుంది. నేటికీ, అన్ని మతాల ప్రజలు కలిసి హోలీ ఆడి ప్రేమ రంగులతో గులాబీ…
మనం అన్ని పండుగలనూ ఆనందంగానే జరుపుకుంటాం. హోలీని మరింత సంబరంగా జరుపుకుంటాం. ఎందుకంటే అది వసంతాగమనానికి పీఠిక కాబట్టి. అది ప్రకృతి కొత్త అందాలు నింపుకున్నదనటానికి సూచిక కాబట్టి. ఆమని వచ్చే వేళ రంగురంగులతో ముస్తాబవుతున్న అవనిని చూసి మది మురిసిపోతుంది. ఆ మురిపెంలోనే రంగులు చల్లుకొనాలనిపిస్తుంది.
Pedda Gattu Jathara: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేడుకగా నిర్వహించే లింగమంతుల స్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత ఇది రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా ప్రాచుర్యం పొందింది. యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామి జాతర ఆదివారం అర్ధరాత్రి కేసారం నుంచి పెద్దగట్టు దేవరపెట్టే రాకతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ మహాజాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి…