వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అన్యమత ప్రచారంపై అధికారులు పొంతన లేని సమాధానం చెబుతున్నారు. బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు తమ పుట్టిన రోజులతో పాటు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, నిరాశ్రయులకు మాంసాహారంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇందులో భాగంగా.. మోడీ ప్రభుత్వం ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తోందని, భారత్ భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యంతో గొప్పదని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యత ఉన్న దేశం మరొకటి లేదని, మన దేశంలో 121 భాషలు ఉన్నాయని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే, భారతదేశం భాషలలో గొప్ప వైవిధ్యాన్ని కలిగి ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మన రాజ్యాంగంలో 14…
ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మన అదృష్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత పాలకులు జయ జయహే తెలంగాణ గీతాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. గత పదేళ్లలో తెలంగాణ తల్లి వివక్షకు గురైందన్నారు. ఈ పండుగ రోజు రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు.