సీతారాముల కల్యాణం కన్నులు పండుగ జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేదికపై నుంచి సీతారాముల కల్యాణం తిలకించారు. అనంతరం వేడుకును ఉద్దేశించి ప్రసంగించారు. పరిపాలన అంటే రామ పాలన జరగాలని అందరూ కోరుకుంటారన్నారు. “తండ్రి మాటకు కట్టుబడి వనవాసం వెళ్లారు.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒంటిమిట్ట లో జరుపుకుంటున్నాము. వెంకటేశ్వర స్వామి కనుసన్నల్లోనే జరగాలని కోరుకున్నాం.. ఒకే శిలా పై సీతారాముల తో పాటు లక్ష్మణ విగ్రహాలు ఉన్నాయి. తిరుపతి నుంచి ఒంటిమిట్ట వచ్చే సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలి. కొండలపై ఆయుర్వేద మొక్కలు నాటాలి. టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం. టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తాం. దేవాలయాలు లేకుంటే కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు. ప్రపంచంలో ఇటువంటి వ్యవస్థ లేదు.” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
READ MORE: Nara Lokesh: టీటీడీ గోశాలలో గోవుల మరణాల ప్రచారంపై మంత్రి నారా లోకేష్ రియాక్షన్..
రామరాజ్యం తేవడమే నా ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీరాముని సాక్షిగా రాష్ట్రం ప్రతిఒక్కరికి న్యాయం చేస్తానని.. భారత దేశం ప్రధాని నాయకత్వం లో రామరాజ్యం గా అభివృద్ధి చెందుతుందన్నారు. రామరాజ్యం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీరాముని స్ఫూర్తి గా తీసుకుని ప్రతిఒక్కరు పేదల కు అండగా నిలవాలని.. సాటి మానవుడు కూడా బాగుండాలని అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.. రాత్రికి ఒంటిమిట్ట లోని టీటీడీ గెస్ట్ హౌస్ లో సీఎం బస చేయనున్నారు.
READ MORE: Allahabad HC: మరో వివాదంలో అలహాబాద్ హైకోర్టు.. “అత్యాచార” తీర్పుపై సర్వత్రా విమర్శలు