మహేంద్ర సింగ్ ధోని బ్యాక్ టూ బ్యాక్ సిక్సర్లుగా కొట్టాడు. అంతే ధోని అభిమానులను కరిగిపోయేలా చేసింది. ఆ రెండు సిక్సర్లతో ఎంజాయ్ చేశారని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ ఏడాది నుంచి కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్స్ గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.. సింపుల్ గా చెప్పాలంటే ఈ నిబంధన ప్రకారం మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఎప్పుడైనా ఒక ఆటగాడిని మార్చి మరో ఆటగాడిని ఫీల్డ్ లోకి తీసుకోవచ్చు.. అయితే ఈ నిబంధనను వివిధ జట్లు వివిధ రూపాల్లో వాడుతున్నాయి.
మరో 24 గంటల్లో ( రేపటి ) నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ కు తెరలేవనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్ లో నాలుగు సార్లు టైటిల్ విన్నర్ సీఎస్కే, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
భారత్ కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోని.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను నాలుగు సార్లు టైటిల్ విజేత నిలిపాడు. ఐపీఎల్ లో ధోని లెక్కకు మించి రికార్డులు ఉన్నాయి.
ఐపీఎల్ లాగే తొలి మ్యాచ్ నుంచి అభిమానుల ఆసక్తి పెంచుతూ వచ్చిన WPL.. చివరి దశలో కూడా ఐపీఎల్ అడుగు జాడల్లోనే నడుస్తోంది. WPL 2023 ఎలిమినేటర్ లో యూపీ వారియర్జ్ ను ఓడించిన ముంబయి ఇండియన్స్ ఫైనల్ చేరింది. అప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు WPL ఫైనల్ చేరుకుంది.
ప్రపంచవ్యాప్తంగా గుర్తి్ంపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) లోనూ అలాంటి ఆటగాళ్లకు కొదవలేదు. ప్రతి జట్టులో కనీసం నలుగురు లేదా అయిదుగురు ఆల్ రౌండర్లు కచ్చితంగా ఉంటారు. వీరిలో కొంతమంది మాత్రమే నిలకడైన ఆటతీరుతో అభిమానుల గుండెల్లో నిలిచిపోతారు. అయితే ఐపీఎల్ 16వ సీజన్ లో అందిరి కళ్లు పలువురు ఆల్ రౌండర్లపైనే ఉన్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రాక్టీస్ చూసిన ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. ఎందుకంటే అతను ఈ సారి ప్రాక్టీస్ సెషల్ లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు.
ఐపీఎల్ కోసం వచ్చేస్తున్నానని బెన్ స్టోక్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా అంటూ చెన్నై, ఐపీఎల్ ను ట్యాగ్ చేశాడు. సీఎస్కే స్టోక్స ఎంట్రీకి సంబంధించిన వీడియోను ఇవాళ తన ట్విట్టర్ లో రీలిజ్ చేసింది.