ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. రేపు సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఇక, ఇప్పటి వరకు సీఎస్‌గా కొనసాగుతోన్న సమీర్ శర్మ.. రేపు బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.. ఇప్పటికే రెండుసార్లు పదవి పొడిగింపు పొందిన సమీర్ శర్మను వదులుకోవడానికి సిద్ధంగా లేరు సీఎం వైఎస్ జగన్.. దీంతో, 2023 నవంబర్ వరకు ఆయన పదవీకాలం పొడిగించాలంటూ కేంద్రాన్ని మరోసారి కోరారు..…
CS Sameer Sharma Falls Sick: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో బ్యాంకు అధికారులతో సమీక్ష చేస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు.. వెంటనే ఆయన్ను అధికారులు ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్చారు.. అయితే, సమీర్ శర్మ గత నెలలో కూడా అస్వస్థతకు గురయ్యారు.. ఇటీవలే హైదరాబాద్‌లో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు.. ఆ తర్వాత దాదాపు వారం రోజుల నుంచి విధులకు…
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఆయన కొద్దిపాటి అస్వస్థతకు గురై విజయవాడలోని స్థానిక ఆసుపత్రిలో చేరి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. అయితే వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఆయన హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం సీఎస్ సమీర్ శర్మకు గుండె సంబంధిత చికిత్స జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కొద్ది రోజుల్లో ఆరోగ్యం కుదుటపడిన పిమ్మట సీఎస్ సమీర్…
Andhra Pradesh: ఏపీలో పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు కేటాయిస్తూ, పలువురు ఐఏఎస్‌లను బదిలీలు చేస్తూ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా విజయసునీత.. గ్రామ, వార్డు, సచివాలయాల అడిషనల్ డైరెక్టర్‌గా భావన.. శ్రీకాకుళం జేసీగా నవీన్.. పార్వతీపురం ఐటీడీఏ పీవోగా విష్ణుచరణ్.. మిడ్ డే మీల్స్ డైరెక్టర్‌గా నిధి మీనా.. ఏపీ సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్‌గా కట్టా సింహాచలం బదిలీ అయ్యారు. Read Also:…
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈనెల 29న అమరావతిలోని సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరగనుంది. ఈనెల 29న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అవుతుందని సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. అయితే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలపై ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా ప్రతిపాదనలు పంపించాలని వివిధ ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులకు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు…
Chandrababu wrotes letter to cs sameer sharma: గోదావరి వరదలతో అష్టకష్టాలు పడుతున్న ప్రజలను, పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని కోరుతూ సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గోదావరి వరదల కారణంగా నాలుగు జిల్లాల్లో వరద బాధితులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ సాయం మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చంద్రబాబు కోరారు. గోదావరి…
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దళిత యువకుడు నారాయణ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. సీఎస్‌కు రాసిన లేఖ కాపీని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి కూడా చంద్రబాబు పంపారు. పోలీసుల దెబ్బల కారణంగానే దళిత యువకుడు నారాయణ చనిపోయాడని.. రాజకీయ ప్రత్యర్థులు, దళితులు, మైనార్టీలు, మహిళలు, బీసీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని పోలీసుల దౌర్జన్యాలు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. నారాయణ మరణం ఏపీలోని ఒక…
ఏపీ సీఎస్ సమీర్ శర్మకు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తన సస్పెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పును ఇంకా అమలు చేయడం లేదంటూ ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో పేర్కొన్నారు. తనను సస్పెండ్ చేస్తూ గతంలో జీవో జారీ చేసిన కాలం నుంచే తన సస్పెన్షన్ రివోక్ చేయాలని కోరారు. హైకోర్టు ఉత్తర్వులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని.. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మాత్రమే తన సస్పెన్షన్ రివోక్ చేస్తూ…
ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఉన్న సమీర్ శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే దీనిపై కేంద్రానికి విజ్ఞప్తి చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీఎస్ సమీర్ శర్మ పదవీకాలాన్ని ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. ఏపీ సీఎస్ పదవీకాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది డీవోపీటీ.…
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సచివాలయానికి వచ్చారు.. యూనిఫాంలో సెక్రటేరియట్‌కు వచ్చారు ఏబీవీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిశారు.. ఇక, ఏబీ వెంకటేశ్వపరావుకు పోస్టింగ్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే కాగా… సుప్రీం కోర్టు ఆదేశాలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు ఏబీవీ.. ఈ సందర్భంగా ఓ లేఖను సీఎస్‌కు సమర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. సీఎస్ సమీర్ శర్మకు రిపోర్ట్ చేయడానికి వచ్చానని తెలిపారు ఏబీ…