ఏపీ సీఎస్ సమీర్ శర్మకు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తన సస్పెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పును ఇంకా అమలు చేయడం లేదంటూ ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో పేర్కొన్నారు. తనను సస్పెండ్ చేస్తూ గతంలో జీవో జారీ చేసిన కాలం నుంచే తన సస్పెన్షన్ రివోక్ చేయాలని కోరారు. హైకోర్టు ఉత్తర్వులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని.. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మాత్రమే తన సస్పెన్షన్ రివోక్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని లేఖలో ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు
Vijaya Sai Reddy: అచ్చెన్న.. ఆల్రెడీ టీడీపీ ఆఫీసులకు తాళాలు పడ్డాయి
తన సస్పెన్షన్‌ను రివోక్ చేస్తూ ఇచ్చిన జీవోను సవరించాలంటూ వివిధ సందర్భాల్లో తాను చేసిన విఙప్తులను ఇప్పటికీ పట్టించుకోలేదని ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో పేర్కొన్నారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదని.. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని సీఎస్ సమీర్ శర్మకు రాసిన లేఖలో ఏబీ వెంకటేశ్వరరావు సూచించారు. కాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సమయంలో సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో జగన్ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.