ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు సీఎస్ సమీర్ శర్మ. సీఎస్ తో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. గత కొంతకాలంగా పెండింగ్‌లో వున్న ఆర్థికేతర అంశాలను తక్షణం పరిష్కరిస్తామని గతంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో జరిగిన భేటీలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఉద్యోగుల అర్ధికేతర సమస్యల పరిష్కారంపై ఇప్పటికే దృష్టి సారించింది ప్రభుత్వం. ఆర్దిక సమస్యలపై జాయింట్ స్టాఫ్…
వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏపీ సీఎస్ సమీర్ శర్మ భేటీ అయ్యారు. కేబినెట్ నిర్ణయాల అమలు, పెండింగ్ అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. సీఎం ఇచ్చిన హామీలపై తీసుకున్న చర్యలపై శాఖల వారీగా నివేదిక ఇవ్వాలని సమావేశంలో కార్యదర్శులకు ఆదేశాలిచ్చారు. నవంబరు 30 తేదీనాటికల్లా కరోనా కారణంగా మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల చేపట్టాల్సిందిగా మెమో జారీ చేశారు. ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి డీపీసీల నియామకంపై చర్యలు చేపట్టాల్సిందిగా సీఎస్ సూచనలు…
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మను నియమించారు.. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం ఈ నెలతో ముగియనుండడంతో.. దీంతో.. కొత్త సీఎస్‌గా సమీర్ శర్మన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈనెల 30న ఆదిత్యానాథ్ దాస్ పదవీ విరమణ చేయనుండగా.. అక్టోబర్ 1వ తేదీన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు సమీర్ శర్మ.. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆప్కో సీఎండీగా బాధ్యతలు నిర్వహించారు.…