Pakistan: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనేది ప్రపంచానికి తెలుసు. ఇటీవల, ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ట్ వెనక కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉన్నట్లు మన భద్రతా ఏజెన్సీలు తేల్చాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తానీ లీడర్ చౌదరి అన్వరుల్ హక్ కూడా తాము ఉగ్రవాదానికి పాల్పడుతున్నామని బహిరంగంగా ఒప్పుకున్నాడు.
Pak-Afghan: ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ మధ్య టర్కీలో జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో రెండు దేశాలు మరోసారి యుద్ధానికి దగ్గరగా చేరాయి. చర్చలు విఫలమైనట్లు ఇరు దేశాలు స్టేట్ మీడియా వెల్లడించింది. చర్చలు విఫలమైతే ఆఫ్ఘాన్‌పై దాడులు చేయడం తప్పా వేరే మార్గం లేదని ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.
India-Afghanistan: భారతదేశంలో, ఆఫ్ఘానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ పర్యటిస్తున్నారు. తాలిబాన్లు 2021లో ఆఫ్ఘాన్ అధికారాన్ని చేపట్టిన తర్వాత, భారత్‌లో ఒక తాలిబాన్ మంత్రి పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక రాజకీయాల కారణంగా ఆఫ్ఘాన్‌తో సత్సంబంధాలు భారత్‌కు ఇప్పుడు కీలకం.
Pakistan: జైషే మహ్మద్ ఉగ్రసంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత వారం పాకిస్తాన్‌లోని బాలాకోట్ తహసీల్ లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమం ఉగ్రవాది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం ఉన్న బహవల్పూర్‌పై భారత వైమానిక దళం దాడులు చేసింది. ఈ దాడిలో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు హతమయ్యారు. భారత్ ‘‘అజర్ కుటుంబాన్ని హతమార్చింది’’ని కాశ్మీరీ అంగీకరించారు.
Pakistan: పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పంజాబ్‌లోని మురిడ్కే లోని లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్‌ని ధ్వంసం చేసింది. మే 7న భారత్ జరిపిన దాడిలో లష్కర్ ప్రధాన కార్యాయలం దెబ్బతిన్నది. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ దెబ్బతిన్న భవనం శిథిలాలను తొలగిస్తోంది. కొత్తగా భవనాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది.
Pahalgam Attack: ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదుల్ని వేటాడి హతమారుస్తు్న్నారు. భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, బీఎస్ఎఫ్ జాయింట్ ఆపరేషన్లలో విజయాలు సాధిస్తున్నారు. విదేశీ, స్థానిక ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పటి వరకు ఆరు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 21 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల్లో 12 మంది పాకిస్తాన్ పౌరులు కాగా, 9 మంది స్థానిక వాసులు. ఆపరేషన్…
ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటు వర్షాకాల సమావేశంలో రెండవ రోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోమవారం కూడా లోక్ సభలో అర్ధరాత్రి 12 గంటల వరకు చర్చించారు. తాజాగా ఈ అంశంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడారు. పహల్గాంలో టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని రాహుల్ గాంధీ అన్నారు.
Pahalgam terrorists: జమ్మూ కాశ్మీర్‌లో రెండు నెలల క్రితం అమాయమైన 26 మంది టూరిస్టుల్ని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘‘ది రెస్టిస్టెంట్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు చంపేశారు. ప్రకృతి అందాలను చూడటానికి వచ్చిన పర్యాటకుల్ని మతం పేరు అడుగుతూ చంపేశారు. ఈ ఘటన తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయారు.
Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడి 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) తన స్థావరాన్ని మార్చే పనిలో ఉంది. లష్కరే తోయిబా ఉగ్రసంస్థ అనుబంధంగా పనిచేసే టీఆర్ఎఫ్ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే, టీఆర్ఎఫ్‌ని విదేశీ ఉగ్రవాద సంస్థ(FTO)గా అమెరికా గుర్తించినందున తన హెడ్‌క్వార్టర్‌ను మార్చే పనిలో ఉంది.
భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ జాడపై కీలక సమాచారం బయటకు వచ్చింది. ఓ జాతీయ మీడియా ఈ సమాచారాన్ని అందించింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో మసూద్ అజార్ కీలక స్థావరం బహవల్పూర్ ఉంది.. ఈ ప్రాంతానికి దాదాపు 1,000 కి.మీ దూరంలో ఈ ఉగ్రవాది ఉన్నట్లు తెలుస్తోంది. బహవల్పూర్ బురుజుకు 1,000 కి.మీ దూరంలో ఉన్న సీఓకేలో మసూద్ అజార్ కనిపించాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. కాగా.. అజార్…