India vs Pakistan: అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై అక్కసు వెళ్లగక్కడం పాకిస్థాన్‌కు మొదటి నుంచి ఉన్న అలవాటు. అయితే, చైనా అధ్యక్షతన జరిగిన భద్రతా మండలి సమావేశంలో జమ్మూ కశ్మీర్‌ను ఉద్దేశించి పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషక్ దార్ హాట్ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీస్ ఘాటుగా బదులిచ్చారు. యూఎన్ ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉన్న 20 సంస్థలను దాయాది దేశం పాక్ పెంచి పోషిస్తోంది అని…
Masood Azhar: నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ చీఫ్, 2001 భారత పార్లమెంట్ దాడి సూత్రధారి మసూద్ అజార్ దాయాది దేశం పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇటీవల పాకిస్తాన్ బహవాల్ పూర్‌లో ఒక ఇస్లామిక్ సెమినరీలో అజార్ ప్రసంగించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీంట్లో అతను భారతదేశంపై దాడులు కొనసాగిస్తామని చెప్పడం, ప్రధాని నరేంద్రమోడీపై అవమానకరమైన పదాలను ఉపయోగించడం కనిపించింది. దీంతో పాకిస్తాన్ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
పశ్చిమ సరిహద్దులో సీమాంతర ఉగ్రవాదంపై భారతదేశం చాలా కాలంగా ఎదుర్కొంటున్న సవాలుకు ఇప్పుడు మరింత సరైన స్పందన లభిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం అన్నారు.