అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి.. స్థానికంగా పౌర హక్కుల కార్యకర్తలు, న్యాయమూర్తులు, పాత్రికేయులు భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. మహిళల పరిస్థితి దీనంగా మారింది. తమను తాలిబన్లు వేటాడుతున్నారంటూ, ప్రాణభయం ఉందంటూ చాలామంది ఇది వరకే వాపోయారు. కొందరు దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. తాజాగా ఇదే ప్రయత్నాల్లో ఉన్న మహిళా హక్కుల కార్యకర్త ఫ్రోజన్ సఫీతో సహా నలుగురు మహిళలను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బాల్ఖ్ ప్రావీన్స్‌లోని మజారే షరీఫ్‌లో వీరు హత్యకు గురయ్యారు. ఓ…
విశాఖ : టిక్ టాక్ స్టార్ ఫన్ బకెట్ భార్గవ్ కు బెయిల్ రద్దు అయింది. భార్గవ్ కు మరోసారి రిమాండ్ విధించింది పోక్సో కోర్టు. అవకాశం ఇప్పిస్తానని చెప్పి మాయమాటలతో బాలికను లోబర్చుకున్న భార్గవ్… పెందుర్తి పిఎస్ కేసులో ఏప్రిల్ 18 న అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో జూన్ 15 న షరతులతో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. బెయిల్ పై బయటకు వచ్చాక… షరతులతో కూడిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడు భార్గవ్.…
విశాఖపట్నం…. చీకటి వ్యాపారాలకు రాచమార్గంగా మారింది. ఇతర దేశాలు,రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా.. నిషేధిత సరుకుల సరఫరా జరిగిపోతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ముఠాలు చాకచక్యంగా వ్యవహరించి కోట్లకు పడగలెత్తుతున్నాయి. బలహీనతను చంపుకోలేని జనం మాత్రం బలైపోతున్నారు.ఇటీవల విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ ఫేక్ సిగరెట్ డంప్ బయటపడింది. కల్తీ సిగరెట్లు బ్రాండెడ్‌కు దగ్గరగా ఉంటూ ధూమపాన ప్రియులను తక్కువ ధరలతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఐటీసీ గుర్తింపు పొందిన కంపెనీల సిగరెట్స్ మాత్రమే మార్కెట్లో అందుబాటులో…
హైదరాబాద్ అంబర్ పేట్ లోని పాత పుస్తకాల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది… సుమారు ఒంటి గంట ప్రాంతంలో షాపులో మంటలు చెలరేగినట్టు స్థానికులు చెబుతున్నారు… సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసారు… పుస్తకాలు షాపు కావడంతో మంటలను అదుపుచేయటం ఫైర్ సిబ్బందికి కష్టతరం అయింది.. దీపావళి టపాసుల వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇది ఇలా ఉండగా.. అటు హైదరాబాద్‌లో దీపావళి వేడుక విషాదాన్ని మిగిల్చింది. ఛత్రినాక పోలీస్…
దీపావళి సందర్భంగా ఉత్తరాధికి చెందిన వ్యక్తులు లక్ష్మీ పూజను నిర్వహిస్తుంటారు. దీపావళికి ముందురోజు ఈ పూజను నిర్వహిస్తారు. పూజగదిలో డబ్బును ఉంచి పూజిస్తారు. ఇలానే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నివశించే ప్రకాశ్ చంద్ జైన్ అనే వ్యక్తి తన ఇంట్లో లక్ష్మీపూజను నిర్వహించారు. పూజ నిర్వహించేసమయంలో గదిలో మూడున్నర లక్షల డబ్బును ఉంచారు. ఇంటికి వచ్చిన అతిధుల కోసం క్యాటరింగ్ ఆర్డర్ చేశాడు. అతిథులు భోజనాలు చేసిన తరువాత వారిని పంపించేందుకు యజమాని జైన్ బయటకు రాగానే, కేటరింగ్…
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎనిమిది మంది ఉండగా.. ముగ్గురు స్పాట్ లోనే మరణించారు. అయితే.. మృతి చెందిన వారిలో శుశాంక్ అనే బాలుడు ఉండటం…
మహారాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి అనీల్ దేశ్‌ముఖ్‌ను మనీలాండరింగ్ కేసులోఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ముంబై కార్యాలయంలో 12 గంటలపాటు సుధీర్ఘంగా అనీల్ దేశ్‌ముఖ్‌ను అధికారులు ప్రశ్నించారు. ముంబైలో బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని సస్పెండ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజే ను ఆదేశించినట్టు ముంబై మాజీ పోలీసు అధికారి పరంబీర్ సింగ్ ఆరోపణలు చేశారు. దీంలో ఎన్‌పోర్స్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి అనీల్ దేశ్‌ముఖ్‌కు నోటీసులు…
కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రియుడితో వెళ్తూ బైక్ నుంచి కింద పడి ఇంజినీరింగ్ యువతి మృతి చెందిన ఘటన ఓర్వకల్ మండలం ఎంబాయి వద్ద చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి పల్లికి చెందిన ఓ యువతి.. ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈనెల19న ఆ యువతికి వేరే యువకుడితో వివాహం జరగాల్సి ఉంది. అయితే ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం లక్ష్మిపురానికి చెందిన వెంకటేశ్వర్లుని ఆమె ప్రేమించినట్టుగా తెలుస్తోంది. ఈరోజు తన…
నాలుగు రోజులుగా కోడిపుంజులు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయి. వాటికి బియ్యం అందిస్తూ పోలీసులు జాగ్రత్తగా చూస్తున్నారు. వాటి రంగుల ఆధారంగా మూడు పుంజులను త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టబోతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నాలుగురోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలంలోని దంతలబోరు శివారులోని అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు కోడిపందేలకు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కోడిపందేలు నిర్వహిస్తున్న వారిని, మూడు కోళ్లను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఐదుగురు నిందితులకు నోటీసులు ఇచ్చి వదిలేశారు. అయితే,…
ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్ధం కావడం లేదు. ఎందుకంటే తెలియని వారికంటే ఎక్కువ తెలిసినవారి చేతిలోనే చాలామంది మోసపోతున్నారు. కొద్దీ రోజుల్లో పెళ్లి.. ఎంతో అందమైన జీవితం ఊహించుకున్న ఆ అమ్మాయి జీవితాన్ని వరుసకు అన్న అయ్యే యువకుడు రోడ్డుపాలు చేశాడు. అన్ననే కదా అని కారు ఎక్కిన పాపానికి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి యువతిని రేప్ చేయడమే కాకుండా, ఆమె నగ్న ఫోటోలను…