భారీ గంజాయి ముఠాను అరెస్ట్ చేసారు నాంపల్లి రైల్వే పోలీసులు. మూడు కోట్లు విలువ చేసే..336 కేజీల గంజాయి సీజ్ చేసారు. ఏసీ కోచ్ లో చిన్న చిన్న బ్యాగ్ లలో పెట్టి గంజాయి తరలిస్తోంది ముఠా. వైజాగ్ నుండి ముంబై వెళ్లే LTT ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లో ఈ ముఠా పట్టుబడింది. లింగంపల్లి లో తనిఖీలు చేసారు నాంపల్లి రైల్వే పోలీసులు. 24 లాగేజ్ బ్యాగులలో అక్రమంగా తరలిస్తున్న 67 లక్షల విలువ చేసే 336…
కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎవరినీ వదలడం లేదు. మాజీ సైనికుడు క్యాన్సర్ చికిత్స కోసం దాచుకున్న డబ్బులను సైబర్ నేరస్థులు కొట్టేశారు.చెక్ బుక్ కోసం టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసిన తీరును క్యాష్ చేసుకున్న సైబర్ నేరస్థులు చికిత్స కోసం మూడు బ్యాంక్ ల్లో దాచుకున్న 2 లక్షల 30 వేల రూపాయలను దోచేశారు. ఇక్కడ భార్యతో సహా కనిపిస్తున్న ఈయన పెద్దబోయిన భిక్షపతి. మాజీ సైనికుడు దేశ సేవకోసం బార్డర్‌లో సేవలందించారు. విజయవంతంగా సేవలు…
శంషాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. టీవీ సీరియల్స్ నటి లహరి కారు నడుపుతూ బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత కారు చుట్టూ గుమిగూడిన జనాల్ని చూసి భయపడిన లహరి, కిందికి దిగలేదు. దాంతో పోలీసులు, ఆమెను కారులోనే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. లహరి మద్యం సేవించిందేమోనన్న అనుమానంతో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. అయితే ఆమె మద్యం…
శిల్ప కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిట్టి పార్టీల కోసం దివానోస్ క్లబ్ ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందులో సినీ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. దివానోస్ క్లబ్‌లో 90 మందిని చేర్చారు. పార్టీలకు వచ్చిన వారికి అధిక వడ్డీ ఎర వేశారు. ఆమె ఆఫర్లను నమ్మి బ్లాక్ మనీని శిల్ప చేతిలో పెట్టారు కొందరు వ్యాపారవేత్తలు. మరోవైపు…శిల్ప కేసులో మరో ఇద్దరు పేర్లు బయటకు వచ్చాయి. షామీర్‌పేటకు…
శిల్ప కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది. అయితే… శిల్పా బాధితులు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే సీజ్ చేసిన శిల్పా ఫోన్ నుండి పలు నెంబర్ల గుర్తించారు పోలీసులు. శిల్పా బాధితుల్లో ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే.. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖుల కుటుంబ సభ్యులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కోట్ల రూపాయల డబ్బులను వసూలు చేసిన శిల్పా… అధిక వడ్డీలు, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు…
చిన్న చిన్నవిషయాలకు మసస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కూర నచ్చలేదని, నచ్చిన వస్తువు కొనివ్వలేదని ఇలా చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలానే భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని ఓ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అంబర్‌పేట్‌లో జరిగింది. అంబర్‌పేటలో శ్రీనివాసులు, టి విజయలక్ష్మీలు గోల్నాక తిరుమలనగర్‌లో నివశిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భర్త శ్రీనివాస్ ద్విచక్రవాహనంపై తిరుగుతూ చీరలు విక్రయిస్తుంటాడు. ఇంట్లో టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. Read: వైరల్: రన్‌వేపై విమానం…
సిద్దిపేట జిల్లా తొగుటలో దారుణం చోటు చేసుకుంది. చిన్నారిని కరెంట్ షాక్ ఇచ్చి చంపాడు ఓ కర్కశ తండ్రి. ఈ దారుణ సంఘటన.. శుక్రవారం… తొగుటలోని వెంకట్రావ్‌పే టలో జరిగింది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. వెంకట్రావ్‌పేట కు చెందిన మిరుదొడ్డి సునీత, రాజశేఖర్ దంపతులకు కూతురు ప్రిన్సీ ఉంది. చిన్నారిని.. ఆడించడానికి రాజశేఖర్ మధ్యాహ్నం వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలోనే… షాటర్ వైర్ తో తన కూతరు కాళ్లకు షాక్ ఇవ్వడంతో చిన్నారి…
సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. అందులో ఉన్న వారితో పాటు…వారిని రక్షించేందుకు…బావిలోకి దిగిన గజ ఈతగాడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. శాయశక్తుల కష్టపడి.. బావిలో పడిన కారును బయటకు తీసే క్రమంలో అందులోనే చిక్కుకుపోయాడు. ఆరు గంటలు శ్రమించి… చివరకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన గజ ఈతగాళ్లు.. క్రేన్ సాయంతో కారును బయటకు తీయగా.. అందులో తల్లీకొడుకుల మృతదేహాలు బయటపడ్డాయి. మెదక్…
చిన్నపాటి నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, అధికారుల నిర్లక్ష్యం యువత ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రహరీ గోడను ఢీకొని యువకుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద జరిగిన ఘటన ఇది. గొల్లపల్లి గ్రామానికి అనుకొని ఉన్న ఎయిర్ పోర్ట్ ప్రహారీ గోడను ఢీకొన్న నవీన్ అనే యువకుడు మరణించాడు. మలుపు వద్ద రోడ్డుకు ఎదురుగా ఉన్న ప్రహరీ కనిపించకపోవడంతో బైక్ తో ఢీకొన్నాడు యువకుడు. నవీన్ మృతి…