దాడి చేసిన వ్యక్తులు గౌతమ్, మనోజ్, మానిక్ ఎల్బీనగర్లో దారుణం జరిగింది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించవద్దన్నందుకు మందుబాబులు వీరంగం సృష్టించారు. ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించవద్దని చెప్పిన యువకులపై మద్యం బాబులు దాడికి దిగారు. కేకే గార్డెన్ ఖాళీ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిని అక్కడి కాలనీ యువకులు తాగొద్దని హెచ్చరించారు. దీంతో ఆగ్రహం చెందిన మందు బాబులు కాలనీ యువకులపై దాడి చేశారు. మృతుడు నరసింహ రెడ్డి సోదరుడు హనుమంతు మాట్లాడుతూ.. మద్యం మత్తు…
వారం రోజుల క్రితమే పెళ్ళయింది. పెళ్ళి కూతురు కాళ్ళ పారాణి కూడా ఆరలేదు. కానీ విధి రూపంలో వచ్చిన ఆర్టీసీ బస్ కొత్త పెళ్ళికొడుకు ప్రాణాలను బలిగొంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వద్ద దేవరకొండ డిపో ఆర్టీసి బస్సు, ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో వికారాబాద్ వన్ టౌన్ ఎస్ఐ శ్రీను నాయక్(32) ఆయన తండ్రి మాన్య నాయక్(50) అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్య తండా వాసులుగా…
యువతులపై వేధింపులు పెరిగిపోతున్నాయి. తమకు ఇష్టం లేకపోయినా వేధించడం ఎక్కువైంది. హైదరాబాద్ లోని మణికొండలో నివాసం ఉంటున్న యువతి(26)రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటుంది. బండ్లగూడ సమీపంలోని సన్‌సిటీలో నివాసం ఉంటున్న సమయంలో ఆమెకు పరిచయం ఉన్న రవికిరణ్ అనే వ్యక్తి కొంతకాలంగా ఆమె వెంటపడి వేధిస్తున్నాడు. ఇటీవల ఆమెను వెంబడించడంతో పాటు చంపేస్తానంటూ బెదిరించడంతో రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. ఇదిలా ఉండగా ఈ నెల 24న సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని గాయత్రీహిల్స్‌లో బ్యూటీ…
హైదరాబాద్‌లో సంచలనం కలిగించిన సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు వ్యవహారంపై దృష్టి సారించింది ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. స్థిరాస్తి వ్యాపారం పేరిట మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గచ్చిబౌలి 7, నార్సింగి, రాయదుర్గం పీఎస్ లో కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. మొత్తం సైబరాబాద్ లో 13 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో మూడు కేసులు సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్…
మహారాష్ట్రలోని నాగపూర్‌లోని యశోధరానగర్‌లో వరసగా వాహనాలు దొంగతనానికి గురవుతుండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరసగా ఫిర్యాదులు అందుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు ఈకేసులో నలుగురికి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 వాహనాలును రికవరి చేసేశారు. అయితే, పదో వాహనం గురించి సర్పరాజ్ అనే దొంగను ప్రశ్నించగా, అతను చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు. చలి బాగా పెరిగిపోవడంతో బైక్‌కు నిప్పు అంటించి చలికాసుకున్నామని చెప్పాడు. దొంగచెప్పన సమాధానం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. నలుగురు…
మయన్మార్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఉత్తర మయన్మార్‌లోని కచిన్ రాష్ట్రంలోని జాడే గనుల్లో కార్మికులు పనిచేస్తుండా హటాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో 70 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఒకరు మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం రెస్క్యూ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఖనిజాల గనుల్లో జాడే గనులు ఒకటి. పెద్ద గనులు మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరమైన గనులు కూడా. Read: ఒమిక్రాన్‌పై బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు… ఈ…
కేరళ కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ గా బంగారం పట్టుకున్నారు. స్పైస్ జెట్ విమానంలో 1.68 కోట్ల విలువ చేసే 3.36 కేజీల బంగారం సీజ్ చేసారు కస్టమ్స్ అధికారులు.బంగారాన్ని పేస్టుగా మార్చి… ఆ పేస్టుగా మార్చిన బంగారాన్ని నాలుగు కవర్స్ లో ప్యాకింగ్ చేసి విమానం క్రూ క్యాబిన్ సీటు కింద దాచారు కేటుగాళ్లు. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు దుబాయ్ నుండి కొచ్చిన్ వచ్చిన స్పైస్ జెట్ విమానంలో తనిఖీలు నిర్వహించింది కస్టమ్స్ బృందం.…
ఈమధ్యకాలంలో అచ్చం సినిమా ఫక్కీలో దొంగతనాలు జరుగుతున్నాయి. అవే కాదు స్కూళ్ళలోని స్ట్రాంగ్ రూంలో ఎగ్జామ్ పేపర్స్ మాయం అవుతున్నాయి. బీరువా తాళాలు పగులగొట్టి మరీ పరీక్షా పత్రాలు దోచేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో జరిగిన ఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. జిల్లా పరిషత్ పాఠశాల లో నిన్న రాత్రి పాఠశాల ఆఫీస్ లోపలికి ప్రవేశించారు దొంగలు. అక్కడే వున్నబీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న త్రైమాసిక పరీక్ష పేపర్లను దొంగిలించారు…
కరేబియన్ దీవి హైతీలో ఘోరప్రమాదం సంభవించింది. కేప్ హైతియాన్లో పెట్రోల్ తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్ పేలింది. ఈ ఘటనలో సుమారు 50 మందికి పైగా మృతి చెందారు. వందలాది మందికి గాయాలయ్యాయి. దాదాపు 20 కి పైగా ఇళ్లు మంటల్లో చిక్కుకున్నట్టు స్థానిక డిప్యూటీ మేయర్ పాట్రిక్ పేర్కొన్నారు. మృతుల సంఖ్యను ఇప్పుడే అంచనావేసి చెప్పలేమని, ఇళ్లల్లో ఉండి మరణించిన వారిని గుర్తించాల్సి ఉందని, డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదంపై హైతీ ప్రధాని…
కిట్టీ పార్టీలతో చిట్టీలతో చేసి డబ్బులు ఎగ్గొట్టిన శిల్ప కేసులో… పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. శిల్పను 3 రోజుల కస్టడీకి ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతించడంతో ఆమెను చంచల్‌గూడ జైలునుంచి కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.. ఇప్పటికే శిల్ప కాల్ రికార్డ్స్‌ను పరిశీలించిన పోలీసులు.. ఆస్తులు, బినామీలపై ఆరా తీస్తున్నారు. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్ల వద్ద డబ్బులు తీసుకున్నట్లు శిల్పపై కేసు నమోదు అయింది. నార్సింగి ఎస్ఓటీ కార్యాలయంలో శిల్పను పోలీసులు మొదటిరోజు ప్రశ్నించారు. ఆమె జరిపిన…