Uttar Pradesh: 8వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి, తాను ఆర్మీ కెప్టెన్ అని నమ్మిస్తూ ఏకంగా 20 మది మహిళల్ని మోసం చేశాడు. మహిళలతో రిలేషన్ పెట్టుకుని, ఆ తర్వాత డబ్బుతో ఉడాయించే వాడు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన హైదర్, తనను తాను హిందువుగా, ఆర్మీ ఆఫీసర్‌గా పరిచయం చేసుకుని మహిళల్ని మోసం చేస్తున్నాడు. నిందితుడు 40 ఏళ్ల హైదర్‌ని లక్నోలో అరెస్ట్ చేశారు.
మహిళలతో సంబంధాలు పెట్టుకున్న తర్వాత పలు కారణాలు చూపుతూ, వారి దగ్గర నుంచి డబ్బులు అడిగేవాడు. ఆ తర్వాత కాంటాక్ట్‌లో లేకుండా పారిపోయే వాడు. వేరే ప్రాంతానికి వెళ్లి మళ్లీ మరో మహిళను నమ్మించి మోసం చేసేవాడు. ఇలా దోచుకున్న డబ్బుతో నిందితుడు విలాసవంతమైన జీవితం గడిపేవాడని పోలీసులు విచారణలో వెల్లడైంది.
Read Also: Daaku Maharaj : డాకు మహారాజ్లో ఆ సీన్‌కు సీట్లు చిరగాల్సిందేనట!
పోలీసులకు చిక్కకుండా అనేక మంది మహిళల్ని మోసం చేసిన హైదర్, ఉత్తర్ ప్రదేశ్‌లో లక్నోకి చెందిన ఒక మహిళ ఫిర్యాదుతో చిక్కాడు. అతడిని కలిసిన తర్వాత ఏదో అనుమానం వచ్చి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. విచారణ చేపట్టిన అధికారులకు సంచలన విషయాలు తెలిశాయి. నిందితుడు దేశంలోని పలు నగరాల్లో సెక్యూరిటీ సంస్థల్లో పనిచేసేవాడని తేలింది. అతడు పనిచేసిన ప్రతీ నగరంలో మహిళల్ని లక్ష్యంగా చేసుకున మోసం చేసి, వారి డబ్బుతో పారిపోయే వాడు.
అనేక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ సృష్టించి, ఆర్మీ యూనిఫాంలో ఫోటోలు పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్మీకి చెందిన పలు యూనిఫాంలు, హార్టిక్ బంగ్లో పేరుతో ఉన్న నకిలీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇతర పత్రాలనున అతడు ఉంటున్న స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు.
అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు హైదర్ ఆరు నెలల క్రితం మహిళ పేరుతో బైక్‌కు ఫైనాన్స్ చేశాడు. బైక్‌ని మహిళ ఇంట్లో ఉంచాడు. ఎప్పుడు వచ్చినా బైక్‌పై తిరుగుతుండే వాడు. హైదర్ 15 రోజుల క్రితం లక్నో వచ్చాడు. తనను ఇక్కడి కంటోన్మెంట్‌లో నియమించినట్లు చెప్పాడు. సైన్యం నుంచి తనకు వాహనం వచ్చిందని చెప్పాడు. బైక్‌పై డ్యూటీకి వెళ్లేవాడు. అతను కెప్టెన్, కమాండో అని చెప్పుకుంటున్నందుకు అతడికి తప్పకుండా ఆర్మీ వాహనం ఉండాలని మహిళ అనుమానించింది. బైక్‌పై డ్యూటీకి వెళ్లడం ఏంటని సందేహించింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం మోసాల చిట్టా బయటకు వచ్చింది.