Crime: తనలో మాట్లాడటం లేదని ఓ వ్యక్తి ఉన్మాదిలా ప్రవర్తించాడు. మహిళ గొంతు కోశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో జరిగింది. 23 ఏళ్ల వ్యక్తి మహిళ గొంతు కోసం గాయపరిచినందుకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఇండోర్‌కి 40 కి.మీ దూరంలోని సాన్వర్ పట్టణంలో అమన్ షేక్ అనే నిందితుడు ఎంబీఏ విద్యార్థినిపై కత్తితో దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.
Live-in relation: తమిళనాడు చెన్నైలోని ఒక అపార్ట్‌మెంట్‌లో తండ్రి, కూతురు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. చాలా నెలల క్రితమే వీరిద్దరు చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఫిర్యాదు చేయడంతో, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ ఘటనలో హత్య-ఆత్మహత్య కోణంలో విచారణ సాగిస్తున్నారు. Read Also: Karnataka: పెళ్లికి నిరాకరించిందని విద్యార్థిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది.. అయితే, ఈ మరణాలతో సంబంధం ఉన్నట్లు…
Live-in relationship: శ్రద్ధవాకర్ దారుణ హత్య ‘‘లివ్ ఇన్ రిలేషన్ షిప్’’లో జరిగిన దారుణానికి ఉదాహారణగా మిగిలింది. అయితే, శ్రద్ధా తర్వాత కూడా ఇలా లివ్ ఇన్‌లో ఉంటున్న చాలా మంది మహిళలు తమ సహచరుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. తాజాగా ఢిల్లీలోని ఘాజీపూర్ లో కూడా ఇలాంటి దారుణమే ఒకటి వెలుగులోకి వచ్చింది.
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ నిత్య పెళ్లికొడుకు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. తాను పోలీసు అధికారినని చెప్పుకుంటూ ఐదుసార్లు వివాహం చేసుకున్నాడు.
Shocking: కలకాలం తోడుండాల్సిన భర్తే కసాయి మారాడు. భార్యని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనను పూర్తిగా విచారించిన పోలీసులకు విస్తూపోయే నిజాలు తెలిశాయి. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను ముక్కలుముక్కలు నరికి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా డెడ్‌బాడీని కుక్కర్‌లో ఉడికించాడు. మిగతా శరీర భాగాలను జిల్లెల్లగూడ చందన చెరువులో పారేశాడు.
Crime: రాజస్థాన్‌కి చెందిన ఒక వ్యాపారవేత్త లక్నోలోని ఓ హోటల్‌లో శవంగా కనిపించాడు. చనిపోయిన వ్యక్తిని రాజస్థాన్ జలోర్ జిల్లాకు చెందిన 44 ఏళ్ల నీలేష్ భండారీగా గుర్తించారు. భండారీ రెండు రోజుల క్రితం నగరంలోని కామ్తా ప్రాంతంలోని ఒక హోటల్‌లో తన గర్ల్‌ఫ్రెండ్‌తో దిగాడు. సోమవారం ఆయన మృతదేహం హోటల్ గదిలో లభ్యమైంది. అతడితో వచ్చిన మహిళ కనిపించడం లేదని, ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Karnataka : కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కూతురి పట్ల కన్న తండ్రే కసాయి వాడయ్యాడు. ముక్కు పచ్చలారని పసి కందును తీసుకెళ్లి బలవంతంగా ముసలోడికి కట్టబెడ్డాడు.
విశాఖ నగర నడిబొడ్డున భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా కలకలం రేపింది. గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జోరుగా ఈ క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 176 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు బెట్టింగ్ కేటుగాళ్లు.
Man Shoots Daughter: పోలీసుల ముందే కూతురిని కాల్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగింది. సదరు యువతి పెళ్లికి నాలుగు రోజుల ముందు తండ్రి చేతిలో హతమైంది. ఆమె హత్యకు కొన్ని గంటల ముందే పంచాయతీ కూడా జరిగింది. తండ్రి నిర్ణయించిన పెళ్లిని కాదని, కూతురు వేరే వ్యక్తిని విహాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంతోనే ఈ హత్య జరిగింది. 20 ఏళ్ల యువతి తను గుర్జార్, తన కుటుంబం కుదిర్చిన పెళ్లిని వ్యతిరేకించింది. తనకు నచ్చిన వ్యక్తిని…