Crime: రూ. 30,000 ఇవ్వని సోదరుడు.. వదినతో సహా మూడు నెలల శిశువు హత్య..
- ఘజియాబాద్‌లో దారుణం..
- వదినతో సహా మూడు నెలల చిన్నారి హత్య..
- తన అన్న రూ. 30,000 ఇవ్వకుండా చేసిందని పగ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. తన వదినతో జరిగిన పాత గొడవను మనుసులో ఉంచకుని ఓ వ్యక్తి దారుణం హత్యలకు పాల్పడ్డారు. వదినతో పాటు ఆమె మూడు నెలల కుమార్తెని గొంతు నులిమి చంపేశాడు. ఈ జంట హత్యలో నిందితుడు 23 ఏళ్ల జీషాన్‌ని పోలీసులు అరెస్ట్ చేరవారు. జీషాన్ రెండు నెలల క్రితం తన కజిన్ సోదరుడు తనపై దాడి చేయడాన్ని అవమానంగా భావించిన జీషాన్ వదినపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. దీంతో పాటు పని కోసం తన సోదరుడిని రూ. 30,000 అడిగితే ఇవ్వకపోవడం, ఇందుకు తన వదినే కారణమనే అనుమానాన్ని పెంచుకున్నాడు.
Read Also: Raja Singh: రోడ్డుపై నమాజ్ చేస్తే, హనుమాన్ చాలీసా.. రాజా సింగ్ సంచలనం..
Also Read
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
అయితే, ఈ హత్యల్ని చూసిన మృతురాలి మరో కుమార్తె అక్కడ నుంచి పారిపోవడంతో దాడి నుంచి బయటపడిందని పోలీసులు చెప్పారు. మృతురాలు షాహీద్ పర్వీన్(34), ఆమె కుమార్తె ఆఫియాగా గుర్తించారు. ఘజియాబాద్ రూరల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సురేంద్రనాథ్ త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం.. వేవ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బమ్‌హేటా గ్రామంలో సోమవారం ఈ హత్యలు జరిగాయి.
జిషాన్, షాహీన్‌ని తన ఇద్దరు పిల్లల ముందే దుపట్టాతో గొంతు నులిమినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఆఫియాను తన చేతులతో గొంతు నులిమి చంపారు. ఆ సమయంలో మూడున్నరేళ్ల అన్భియా ఏడుస్తూ భయపడి అక్కడ నుంచి పారిపోయింది. ఒక వేళ ఆమె అక్కడే ఉంటే నిందితుడు అతడిని చంపేసేవాడని డీసీసీ చెప్పారు. రెండు నెలల క్రితం.. బీహార్‌లో జీషాన్ కుటుంబం ఇంటి నిర్మాణంపై వివాదంలో షహీన్ కజిన్ సోదరుడు అఫ్రోజ్ అవమానించారు. అతడి కాలర్ పట్టుకుని లాగడంతో పగ పెంచుకున్నారు. అయితే, దుబాయ్ వెళ్లాలనుకుంటున్న జీషాన్‌కి తన సోదరుడు బుర్హాన్ రూ.30,000 ఇవ్వకుండా వదిన షహీన్ అడ్డుకుండని అనుమానం పెంచుకున్నాడు. నేరం చేసిన తర్వాత జీషాన్ నోయిడాకు పారిపోయాడు. మహిళ సెల్‌ఫోన్ లాక్కుని బుర్హాన్‌కి ఫోన్ చేసి చంపుతానని బెదిరించాడు. నిందితుడు మంగళవారం ఘజియాబాద్‌కి తిరిగి వస్తుండగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!