Crime: హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. రిలయన్స్ డిజిటల్ షో రూమ్ దగ్గర రక్తం మడుగులో పడి ఉన్న మృతదేహం లభ్యమైంది. అయితే, హయత్ నగర్ లోని ముద్దిరాజ్ కాలనీకి చెందిన నగేష్ గా గుర్తించారు.
UP: ఉత్తర్ ప్రదేశ్ బిజ్నోర్ పట్టణంలో ‘‘మీరట్’’ తరహా మర్డర్ సంచలనంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం భార్యనే భర్తను చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బిజ్నోర్ నజీబాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంతో ఈ ఘటన జరిగింది. రైల్వే టెక్నీషియన్‌గా పనిచేస్తున్న దీపక్ కుమార్‌ని అతడి భార్య శివాని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన భర్త గుండెపోటుతో మరణించినట్లు ముందుగా శివాని చెప్పింది. Read Also: Punjab: బీజేపీ నేత ఇంటిపై గ్రెనేడ్ దాడి.. పాకిస్తానీతో సహా…
Crime News: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్‌లో దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల బాలికపై మామ అత్యాచారం చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని పొరిగింటి వారి కారు డిక్కీలో దాచి పెట్టాడు.
Theft: మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి, దొంగతనం చేసిన క్షమించాలని కోరుతూ లేఖ రాశాడు. ఖార్గోన్ జిల్లాలో ఒక దుకాణం నుంచి రూ. 2.45 లక్షలు దొంగలించిన వ్యక్తి, ‘‘రామ నవమి’’ రోజు దొంగతనం చేసినందుకు క్షమించాలని కోరాడు. అప్పులతో ఇబ్బందులు ఉన్నాయని, అప్పులు ఇచ్చిన వారు ఇబ్బందులు పెడుతున్నారని లేఖలో పేర్కొన్నాడు. ఆరు నెలల్లో దొంగిలిచిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని హామీ కూడా ఇచ్చాడని సోమవారం పోలీస్ అధికారులు చెప్పారు.
UP: తనపై 20 మందికి పైగా వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలో జరిగింది. యూపీ పోలీసులు 23 మంది పురుషులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో 11 మంది గుర్తు తెలియని వారు ఉన్నారు. ఇప్పటి వరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Maheshwaram: హైదరాబాద్ లోని మహేశ్వరం జోన్లో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనను మొదట యాక్సిడెంట్‌గా అనుమానించిన పోలీసులు, ఆ తర్వాత దర్యాప్తులో ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా తేల్చారు. భూతగాదాల వివాదం కారణంగా శంకరయ్య అనే వ్యక్తిని ప్రత్యర్థులు పక్క ప్లాన్ ప్రకారం హత్య చేశారు. శంకరయ్యను టార్గెట్ చేసిన నిందితులు.. అతను బైక్‌పై వెళ్తున్న సమయంలో కారుతో ఢీకొట్టి చంపారు. ఈ ఘటనను యాక్సిడెంట్‌గా మారుస్తూ తప్పుడు దిశగా మళ్లించే ప్రయత్నం చేశారు…
Crime News: హైదరాబాద్ ముషీరాబాద్ బోయిగూడ ప్రాంతంలో చోటుచేసుకున్న ఫైనాన్సర్ దారుణ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్‌ను వైజాగ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫైనాన్సర్ సట్నం సింగ్‌ను నవీన్ ఈ నెల 4వ తేదీన కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హత్య అనంతరం సంప్‌లో మృతదేహాన్ని సంపూలో పడేసి నేరం నుంచి తప్పించుకునేందుకు వైజాగ్‌కు పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు.…
Badminton coach: బెంగళూర్‌కి చెందిన ఒక బ్యాడ్మింటన్ కోచ్ 16 ఏళ్ల మైనర్ బాలికపై పలు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అతడి ఫోన్లో 7-8 మంది బాలిక అభ్యంతరకమైన చిత్రాలు ఉన్నాయనే ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల నిందితుడు హులిమావులోని బాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్నాడు. బాధిత బాలిక గత రెండు ఏళ్లుగా అక్కడే శిక్షణ పొందుతోంది.
Bengaluru: బెంగళూర్‌లో దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి ఒక వీధిలో నడిరోడ్డుపై భార్య గొంతు కోసి చంపాడు ఓ వ్యక్తి. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో జరిగింది. దాడి చేసిన వ్యక్తిని 43 ఏళ్ల కృష్ణప్పగా గుర్తించారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది.
UP: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సౌరభ్ రాజ్‌పుత్ అనే వ్యక్తిని అతడి భార్య ముస్కాన్, ప్రియుడు సాహిల్ శుక్లాలు కలిసి అత్యంత దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో సిమెంట్ వేసి కప్పేశారు. ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విదేశాల్లో పనిచేస్తున్న సౌరభ్ తన కుమార్తె బర్త్ డేకి ఇంటికి వచ్చిన తర్వాత ఈ హత్య జరిగింది. Read Also:…