Crime News: అడ్డుఅదుపు లేకుండా రోజురోజుకి బంగారం, వెండి ధరలు పెరగడం మనం చూస్తూనే ఉన్నాము. ఇది ఇలా ఉండగా మరోవైపు హైదరాబాద్ సిటీ రాచకొండ, సైబరాబాద్, సిటీ కమిషనరేట్ పరిధిలో ఇటీవల బంగారం, వెండి చోరీలు గణనీయంగా పెరిగాయి. కొంపల్లి, దోమలగూడ, హయత్ నగర్, జవహర్ నగర్, ఇబ్రహీంపట్నం, తార్నాక వంటి ప్రాంతాల్లో వరుసగా గోల్డ్ లేదా సిల్వర్ చోరీ కేసులు నమోదవుతున్నాయి. హయత్ నగర్ పెద్ద అంబర్పేట్‌లో ఏకంగా ఒక విల్లాలో దొంగలు చొరబడి 35 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ముషీరాబాద్ దోమలగూడలో వృద్ధ దంపతులపై దాడి చేసి 8 తులాల బంగారు ఆభరణాలును కేర్‌టేకర్ ఎత్తుకెళ్లిన సంఘటన చోటు చేసుకుంది.
Guntur Train Assault: రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం..
అలాగే జవహర్ నగర్ దమ్మాయిగూడలో మూడు తులాల బంగారం, ఏడు తులాల వెండి ఆభరణాలు చోరీ కావడం, ఇబ్రహీంపట్నం రవీందర్ ఇంటికి వెళ్లి తిరిగి చూసినప్పుడు 10 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు దొంగల చేతిలో వెళ్లిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కొంపల్లి, జీడిమెట్లలో ఇనుప రాడ్లను ఉపయోగించి చోరులకు ప్రయత్నం చేసినప్పటికీ ఒక ఇంట్లో విఫలమైన సంగతి వెల్లడైంది. దేవేందర్ నగర్‌లో కూడా ఒక ఇంట్లో కిలో వెండి ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు. కొద్దిరోజుల క్రితం ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇంట్లోకి చోరీచేసి 43 తులాల బంగారం ఎత్తుకెళ్లిన ఘటన, అలాగే చందానగర్‌లో రిటైర్డ్ BHEL ఉద్యోగి ఇంటికి తాళం పగలగొట్టి 17 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలతో పరారీ అయిన కేసులు నగరంలోని భద్రతా సవాళ్లను సూచిస్తున్నాయి.
350hp పవర్, రెట్రో లుక్ ప్రత్యేక డిజైన్‌తో Land Rover Defender 110 Trophy Edition లాంచ్..