Fake Doctor: మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నకిలీ డాక్టర్, కార్డియాలజిస్ట్ని అని చెప్పుకుంటూ పలువురు రోగులకు సర్జరీలు చేశాడు. ఈ ఘటనలో సర్జరీలు ముగిసిన తర్వాత ఏడుగురు పెషెంట్లు మరణించిన సంగతి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని దామోహ్ నగరంలోని ఒక ప్రైవేట్ మిషనరీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్లు జరిగాయి. నకిలీ డాక్టర్ వైద్యం చేసినట్లు జిల్లా అధికారులు గుర్తించి, విచారణ ప్రారంభించారు.
అప్పు నిప్పుతో సమానం.. నిలువునా కాల్చేస్తది అనడంలో సందేహం లేదు. తీరని అప్పు ఎప్పటికైనా ముప్పే. తీసుకున్న అప్పు తీర్చనందుకు ప్రాణాలు తీసిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాజా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. 6 వేల అప్పు తిరిగివ్వలేదని.. ప్రియుడితో కలిసి మహిళను హత్య చేసింది మరో మహిళ. వికారాబాద్ జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ లో వీడిన హత్య మిస్టరీ… నిందితులను పట్టుకున్న పోలీసులు.. బొంరాస్పేట్ మండలం చౌదర్పల్లికి…
Thane: క్యాన్సర్ పేషెంట్ అని చూడకుండా 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిని మహారాష్ట్ర థానే పోలీసులు అరెస్ట్ చేసినట్లు శనివారం తెలిపారు. 29 ఏళ్ల నిందితుడిని బీహార్ నుంచి అరెస్ట్ చేసినట్లు సీనియర్ అధికారి తెలిపారు. బీహార్లో బాలిక కుటుంబం ఉన్న అదే గ్రామానికి చెందిన నిందితుడు రెండు నెలల క్రితం బద్లాపూర్లో వారి కోసం ఒక అద్దె వసతిని ఏర్పాటు చేశాడు. బాలిక చికిత్సకు సాయం చేశాడు.
Homestay Gang War: తిరుపతిలో హోం స్టేల గ్యాంగ్ వార్ సంచలనంగా మారింది. ఆర్టీసి బస్ స్టాండ్ సమీపంలోని చింతలచేనులో రెండు హోం స్టే'ల మధ్య ఘర్షణ జరిగింది. 'డెక్కన్ సూట్స్ హోమ్ స్టే' నిర్వాహకులపై కర్రలు, రాడ్లతో గరుడ హోం స్టే యాజమాన్యం దాడికి దిగింది.
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలోని శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న అజితేష్ (20) అనే విద్యార్థి అదృశ్యం అయ్యాడు. వారాసిగూడలో ఉన్నటువంటి స్నేహితుల దగ్గరికి వెళ్లి వస్తానని చెప్పినట్లు అజితేష్ తండ్రి రామకృష్ణకి విద్యార్థి స్నేహితులు చెప్పారు. అజితేష్ సమాచారం తెలియకపోవడతో.. అజితేష్ తండ్రి ఈరోజు పోచారం పోలీసులకు పిర్యాదు చేశారు. తండ్రి పిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. Also Read:…
Physical Harassment: హైదరాబాద్ నగరంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జర్మన్ యువతిపై అత్యాచారయత్నం చేసిన అస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చి మొదటి వారంలో హైదరాబాద్ వచ్చి, నగరాన్ని సందర్శిస్తున్న జర్మన్ యువతి, యువకుడు ఇద్దరూ స్నేహితుల వద్ద ఉండి అక్కడి ప్రదేశాలను చూస్తూ తిరుగుతున్నారు. అయితే.. నిన్న మార్కెట్ చూసేందుకు జర్మన్ యువతి, యువకుడు బయటకు వచ్చారు. మీర్పేట్ సమీపంలో జర్మన్ యువతి, యువకుడిని అస్లాం, అతడి స్నేహితులు చూశారు. నగరాన్ని…
Gas cylinder accident : వెస్ట్ బెంగాల్ లో దారుణం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలోని ప్రతిమా మండలం ధోలాఘాట్ గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి 9గంటల సమయంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు…
Crime News: గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులపై మారుతల్లి కర్కశత్వం ప్రదర్శించింది. కార్తిక్ అనే బాలుడిని మారు తల్లి లక్ష్మీ గోడకేసి కొట్టి చంపేసింది.
Black Magic: బీహార్ ఔరంగాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చేతబడి, తంత్ర విద్యకు ఓ వ్యక్తి బలయ్యాడు. అత్యంత దారుణంగా అతడి తల నరికి, మొండాన్ని అగ్నిలో కాల్చేశారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని 65 ఏళ్ల యుగుల్ యాదవ్గా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో తాంత్రికుడి బంధువు కూడా ఉన్నాడు.