కామాతురాణాం నభయం నలజ్జ అంటారు. కామంతో కళ్ళు మూసుకుపోయినవాడికి భయం వుండదు.. సిగ్గుశరం వుండవు. విజయవాడలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న అమ్మాయిపై అఘాయిత్యానికి ప్రయత్నించారు కొందరు ఆకతాయిలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అందరినీ కలవరానికి గురిచేసింది. విజయవాడ అరండల్ పేట లోని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఉర్దూ స్కూల్ ప్రాంగణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్కూల్ ఆవరణలో ఎటు చూసినా మద్యం బాటిళ్లు కనిపించాయి. ఈ ఘటనతో పాఠశాలలకు…
ఈమధ్యకాలంలో యువకులు మారణాయుధాలతో తిరుగుతూ కలకలం రేపుతున్నారు. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఓ రాజకీయనాయకుడి బంధువు ఒకరు కత్తితో కేక్ కట్ చేసి, బర్త్ డే వేడుకల్లో హంగామా చేయడం వివాదాస్పదం అయింది. తాజాగా కాకినాడ జిల్లాలో ఓ యువకుడు పిస్టల్ పట్టుకుని హడావిడి చేశాడు. అతని ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. https://ntvtelugu.com/breaking-news-young-lady-suicide-at-esi-metro-station/ సామర్లకోట పట్టణంలో 27వ వార్డు సాయినగర్ కు చెందిన ఓ యువకుడు పిస్టల్‌తో ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్చల్…
బంజారాహిల్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి సంచలనంగా మారింది. రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ మిగ్ పబ్ లో తెల్లవారే వరకు నిర్వహిస్తూ యాజమాన్యం హంగామా సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ దాడుల్లో రాహుల్ సింప్లిగంజ్, ఉప్పల్ అనిల్ కుమార్, నిహారిక, సిరీస్ రాజు కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ర్యాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ ని అధికారులు సీజ్ చేశారు. గతంలో కూడా రాహుల్ పై ఓ పబ్ లో దాడి జరిగిన…
అభం శుభం తెలియని మైనర్ బాలికలు అన్యాయానికి గురవుతున్నారు. తెలిసి తెలియని వయస్సులో కొందరు తప్పుచేస్తే.. మరికొందరు మోసపూరిత మాటలకు బలైపోతున్నారు.. ఆర్దిక ఇబ్బందులు, సమాజం పట్ల అవగాహనా రాహిత్యం, ఆధునిక ప్రపంచం పట్ల మక్కువ, అరచేతిలో ఇంటర్ నెట్ బాలికలను చిన్న వయస్సులోనే మోసపోయేలా.. మరికొందరు తప్పుదారి పట్టేలా చేస్తుంది. మోసమైనా, మోజైనా అంతిమంగా బాలికలే నష్టపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న మైనర్ బాలికల అత్యాచార ఘటనలు సభ్య సమాజాన్ని…
తెలంగాణలో సంచలనం కలిగించిన వికారాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచారం, హత్ కేసు కొలిక్కి వస్తోంది. తానే హత్య చేసినట్టు ప్రియుడు మహేందర్ (నాని) పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. హత్య జరిగిన రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు యువకుడు. ఉదయం మూడు నుండి నాలుగు గంటల ప్రాంతంలో బయటకు రమ్మని బాలికకు ఫోన్ చేశాడు ప్రియుడు. ఊరి చివరన నిర్మాణుష్య ప్రాంతంలో కలుసుకున్నారు ఇద్దరు. శారీరకంగా కలవాలని బాలికను కోరాడు యువకుడు. అయితే ప్రతిఘటించింది…
ఈమధ్యకాలంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరగడం, కొంతమంది ప్రాణాలు పోతుండడం, బైక్ లు ధ్వంసం కావడంతో తనిఖీలు పెంచారు పోలీసులు. బంజారాహిల్స్ పార్క్ హయత్ దగ్గర సాధారణ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు చుక్కలు చూపించారు మందు బాబులు. రోడ్డు కు అడ్డంగా పడుకోవడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. కొంతమందిని పోలీసులు చూసీ చూడనట్లు…
కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. కళ్ళలో పెట్టుకుని కాపురం చేయాల్సిన మొగుడు ఆమెని అతి కిరాతకంగా హతమార్చాడు. భార్యను బతికుండగానే అడవిలో పూడ్చిపెట్టాడో కర్కోటక భర్త ఉదంతమిది. తమిళనాడులో కలకలం రేపిన శాడిస్టు భర్త తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది, బతికున్న భార్యను పూడ్చి పెట్టిన భర్త తాపీగా తన పనులు తానుచేసుకోవడం ప్రారంభించాడు. వేలూరు జిల్లా కాట్పాడీలో ఈ ఘటన జరిగింది. నాలుగేళ్ళ క్రితం సుప్రజ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు వినాయకం. అనుమానంతో పాటు అనారోగ్యంతో…
రోజురోజుకు మానవ సంబంధాలు చచ్చిపోతున్నాయి. సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే అస్సలు వీరికి మానవత్వం ఉందా అనిపించక మానదు. అక్కాచెల్లి, తల్లితండ్రి ఇలాంటి సంబంధాలకు విలువే లేకుండా చేస్తున్నారు కొంతమంది. తాజాగా ఒక అక్క.. తన స్వార్థం కోసం చెల్లిని బలిచేసింది. ప్రియుడి ఇచ్చే డబ్బు, ఫోన్ కి ఆశపడి ముక్కుపచ్చలారని బాలికను ఒక మృగం చేతికి అప్పగించింది. ఆ కామాంధుడు బాలిక అని కూడా చూడకుండా ఆమెను అతి దారుణంగా అత్యాచారం చేసి.. చావుబతుకుల్లో…
నెల్లూరు జిల్లాలో అతిపెద్ద మద్యం స్కాం బయటపడింది. జిల్లాలోని పలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇతర రాష్ట్రాల మద్యం బాటిళ్లు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. నకిలీ స్టిక్కర్లతో ప్రభుత్వ వైన్ షాపులకు గోవా లిక్కర్ సరఫరా అవుతోంది. కొందరు అక్రమార్కులు గోవా నుంచి నెల్లూరు జిల్లా మైపాడుకు తారు ట్యాంకర్ల ద్వారా మద్యం సరఫరా చేస్తున్నారు. గోవాలో 25 రూపాయలకు క్వార్టర్ బాటిల్ కొనుగోలు చేసి నెల్లూరు జిల్లాలో 100 రూపాయలకు వాటిని విక్రయిస్తున్నారు. అయితే ఈ స్కాం…
విశాఖ జిల్లా పాయకరావుపేటలో కులధ్రువీకరణ పత్రాల స్కాం వెలుగుచూసింది. పాయకరావుపేట నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా బీసీ-డి కులానికి చెందిన కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. ధృవీకరణ పత్రాలలో తప్పులు రావడంతో తహసీల్దార్ అంబేద్కర్‌ను బాధితులు ఆశ్రయించారు. అధికారుల పరిశీలనలో ఇవి నకిలీవిగా స్పష్టం కావడంతో అసలు విషయం బహిర్గతం అయ్యింది. విశాఖ కేంద్రంగా 27 మీ సేవా కేంద్రాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి. అయితే తనకు సంబంధం లేకుండా నకిలీ ధ్రువపత్రాలను మంజూరు…