woman killed for refusing to marry: ప్రేమ పేరుతో హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమకు ఒప్పుకోలేదనో.. పెళ్లికి నిరాకరించిందనో యువతులను దారుణంగా హత్య చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదనకు తిరస్కరించిందని యువతిని హత్య చేసి.. తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా కాశీపూర్ బ్లాక్ టికిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓసాపాడ గ్రామంలో చోటు చేసుకుంది. పెళ్లి ప్రతిపాదనకు తిరస్కరించినందుకు యువతిని చంపాడు ఓ వ్యక్తి. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన అతని పరిస్థితి విషమంగా ఉంది. సామ్నాటికోన గ్రామానికి చెందిన బాధిత యువతి రీమా మాఝీ దినసరి కూలీగా పనిచేస్తోంది. సమీపంలోని ముండగావ్ గ్రామానికి చెందిన రసిక ప్రధాన్, రీమా మాఝీకి పెళ్లి ప్రతిపాదన పెట్టాడు. అయితే దీనికి యువతి కుటుంబ సభ్యులు, యువతి తిరస్కరించారు. దీంతో కొపం పెంచుకున్న ప్రధాన్ యువతిని చంపాలని ప్లాన్ వేశాడు.
Read Also: Pineapple Ganesh:తిరుపతిలో వెరైటీ… పైనాపిల్ గణేష్ కి భారీ లడ్డూ
శనివారం మాఝీ ఒక నిర్మాణ స్థలంలో పనినిమిత్తం వచ్చింది. ఆదే సమయంలో అక్కడికి వచ్చిన ప్రధాన్ మరోసారి పెళ్లి విషయంలో చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ప్రధాన్ అకాస్మత్తుగా తనతో తెచ్చుకున్న పదునైన ఆయుధంలో మఝీ గొంతుకోశాడు. తీవ్రగాయంతో యువతి మరణించింది. ఇతర కూలీలు దాడిని ఆపేందుకు ప్రయత్నించిన క్రమంలో వారిపై కూడా ప్రధాన దాడి చేశారు. అనంతరం అతను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోలి కార్మికులు ప్రధాన్ ను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.