చోరీకి కాదేది అనర్హం అన్న తీరుగా దేశంలో పరిస్థితి తయారైంది. ఎక్కడ చూసినా దొంగలు అవాక్కయేలా చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది.
Haryana: ప్రస్తుత కాలంలో ప్రతీ చిన్న సమస్యకు ఆత్మహత్యనే పరిష్కారం అనుకుంటున్నారు. నేటి తరం చిన్న కష్టాన్ని కూడా తట్టుకోవడం లేదు. యువత కష్టాలతో ధైర్యంగా పోరాడలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే మైనర్లు కూడా ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపరుస్తోంది. చిన్న చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు.
ఒకప్పుడు తల్లి దండ్రులను దైవంగా భావించి పూజించేవారు.. రాను రాను కనీసం మనుషుల మాదిరిగా కూడా చూడటం లేదు.. ఆస్తి ఇవ్వలేదనో లేక ఇంకేదో కారణాలతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. కొందరు కొడితే.. మరికొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది.. కన్న తల్లి దండ్రులపై కనికరం లేకుండా తాళ్ళతో కట్టి దారుణానికి ఒడి గడుతున్నారు.. నవమాసాలు కడుపున మోసిన తల్లి, అల్లారుముద్దుగా పెంచుకున్న తండ్రిని సైతం ఆస్తుల కోసం చిత్రహింసలు పెడుతున్నారు కొందరు…
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఓ లగ్జరీ మాల్లో జరిగిన కాల్పుల్లో కనీసం ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ఘటనలో 14 ఏళ్ల అనుమానిత సాయుధుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సెంట్రల్ నోయిడా ఎకోటెక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో నిద్రిస్తున్న బాలికను గుర్తు తెలియని దుండగులు రాళ్లతో కొట్టి చంపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Cyber Investment Fraud: నేరస్తులు పంథా మార్చారు. గతంలోలాగా ఇళ్లను కొల్లగొట్టడం కాకుండా కొత్తగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. గిప్టులు, లక్కీ డ్రా, ఓటీపీల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రూ.854 కోట్ల సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. బెంగళూర్ కేంద్రంగా సైబర్ ఇన్వెస్ట్మెంట్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. పెట్టుబడి పెడితే రోజుకు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు లాభం పొందొచ్చని చెబుతూ దేశంలో వేలాది మందిని మోసం చేశారు.