Sri Sathya Sai District: పెళ్లి అనేది జీవితం లో ఓ భాగం అంటారు. కానీ జీవితంలో భాగమైన వివాహం రెండు జీవితాలకు సంబంధించింది. నచ్చని డ్రెస్ వేసుకోవడానికి మనం ఇష్టపడం. అలాంటిది ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలి అంటే చాల కష్టంగా ఉంటుంది. అయితే తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేయాలి అనుకోవంలో తప్పులేదు. కానీ ఇష్టం లేని పెళ్లి చెయ్యాలి అనుకుంటేనే జీవితాలు నాశనం అవుతాయి. కొన్ని సార్లు ప్రాణాలే పోతాయి. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి కారణం ఇష్టం లేని పెళ్లి చేస్తారని భయపడిన ఓ యువతీ బిల్డింగ్ పైన నుండి దూకి నిండు ప్రాణాలను తీసుకుంది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి గోకులం లోని సాయి శ్రీనివాస అపార్ట్మెంట్లో గౌరీ యువతి కుటుంబంతో కలిసి నివస్తుతుంది.
Read also:AP High Court: చంద్రబాబు కేసులో సీఐడీకి షాక్.. ఆ పిటిషన్ తిరస్కరణ
కాగా డిగ్రీ చదువుతున్న విద్యార్ధిని గౌరీకి ఇంట్లో వాళ్ళు పెళ్లి చెయ్యాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిన్న పెళ్ళి చూపులు ఏర్పాటు చేశారు.. పెళ్లి చూపులు జరగడంతో ఎలాగైన పెళ్ళి చేస్తారని భావించిన యువతి తనకి ఇష్టం లేని పెళ్లి చెయ్యాలని ప్రయత్నిస్తున్నారని సూసైడ్ నోటు రాసి అపార్ట్మెంట్లోని ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనితో తీవ్ర గాయాల పాలైన గౌరీని సత్యసాయి జనరల్ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా యువతి అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు సీసీటీవీ కెమారాలో రికార్డ్ అయ్యాయి. విషయం తెలుసుకున్న పుట్టపర్తి అర్బన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.