Love jihad: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ‘‘లవ్ జిహాద్’’ ఘటన వెలుగులోకి వచ్చింది. రత్లాంలో ఒక ముస్లిం వ్యక్తి హిందువుగా నటిస్తూ ఒక మహిళ సంసారాన్ని నాశనం చేశాడు. వివాహిత అయిన మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చేలా ఒప్పించి, పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేసిన వ్యక్తి, చివరకు మహిళను వదిలేశాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే చంపేస్తానని బెదిరించాడు. చివరకు సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Woman Gang-Ra*ped: హర్యానా ఫరీదాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. కదులుతున్న వ్యాన్‌లో 28 ఏళ్ల మహిళపై రెండు గంటల పాటు సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటన మంగళవారం-సోమవారం మధ్య రాత్రి జరిగింది. గ్యాంగ్ రేప్ తర్వాత దారుణంగా గాయపడిన మహిళను మంగళవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన విసిరేశారు. మహిళను అపహరించిన సమయంలో ఆమె తన ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం ఎదురుచూస్తోంది.
Pragati: టాలీవుడ్‌లో విభిన్న పాత్రలు పోషించి, నిజజీవితంలో వెయిట్ లిఫ్టింగ్‌లో అనేక పథకాలను అందుకున్న నటి ‘ప్రగతి’. తాజాగా ఆమె ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని అనేక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ప్రధానంగా సమాజంలో జరుగుతున్న దారుణమైన అన్యాయాలు, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల తీవ్రమైన ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమాజంలో నేరాలకు పాల్పడే వ్యక్తులు, ముఖ్యంగా మహిళల గౌరవానికి భంగం కలిగించేవారు “భూమికి భారం” అని…
Crime: ఉత్తర్ ప్రదేశ్ కౌశాంబిలో ఒక వివాహిత మహిళను సొంత బంధువైన వ్యక్తి కాల్చి చంపాడు. తన కోరికలను తిరస్కరించిన కారణంగా గురువారం ఉదయం 24 ఏళ్ల మహిళను చంపాడు. గత కొంత కాలంగా మహిళపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఆమె నిరాకరిస్తూ వస్తోంది. దీంతో కోపం పెంచుకున్న వ్యక్తి ఆమెను చంపేశాడు. బాధితురాలిని పోలీసులు దీపికా తివారీగా గుర్తించారు.
దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు వ్యక్తులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. విచ్చల విడిగా రెచ్చిపోతూ… మహిళలను వేధిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. వారిలో మార్పు రావడంలేదు. ఓ బస్సులో మహిళా ప్రయాణీకురాలిపై అసభ్యంగా ప్రవర్తించాడో యువకుడు. పక్కనే కూర్చున్న మహిళపై అసభ్యంగా చేతులు వేస్తూ.. ఆ యువతిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆ యువతి.. ఈ తతంగాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేసింది.…
Delhi Acid Attack 2025: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఒక విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. గాయపడిన విద్యార్థిని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె కళాశాలకు వెళుతుండగా కాలేజీకి కొద్ది దూరంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో ఆమె చేతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు. READ ALSO: Post Office SCSS: పోస్టాఫీసులో సూపర్ స్కీమ్..…
Dowry Harassment: వరకట్న దాహానికి మరో మహిళ బలైంది. పెళ్లయినప్పటి నుంచి అత్తామామల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్ర లోని జల్గావ్ లో జరిగింది. 23 ఏళ్ల మయూరి గౌరవ్ తోసర్ ఆత్మహత్య చేసుకుంది. వివాహం జరిగిన నాలుగు నెలల తర్వాత, ఆమె పుట్టినరోజు తర్వాతి రోజు బలవన్మరణానికి పాల్పడింది. Read Also: Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ దాతృత్వం.. 1500 వరద బాధిత కుటుంబాలకు సాయం.. మయూరిని గత కొన్ని రోజులుగా…
Crime: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి, గొంతు నులిమి హత్య చేశాడు. మైనర్ బాలికతో నిందితుడైన వ్యక్తికి పెళ్లి నిశ్చమమైంది. అయితే, పెళ్లికి ముందే తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని నీలేష్ దోంగ్డా అనే వ్యక్తి, బాలికను వేధించాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేశాడు. Read Also: Mahindra cars: మహీంద్రా గుడ్ న్యూస్, కొత్త జీఎస్టీకి ముందే తగ్గిన కార్ల ధరలు..…